ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి
నెహ్రూసెంటర్: ప్రభుత్వం ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఎన్‌హెచ్‌ఎం జేఏసీ వ్యవస్థాపకుడు పుట్ట మహేందర్‌రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం, నూతన జేఏసీ నాయకుల ప్రమాణస్వీకారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్‌రావు మాట్లాడుతూ.. ఉద్యోగుల రెగ్యులరైజేషన్ తమ ప్రధాన ఎజెండా అని, ఉద్యోగులకు ప్రతీ నెల ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆరు నెలలుగా వేతనాలు సక్రమంగా అందకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా ఎన్‌హెచ్‌ఎం జేఏసీ అధ్యక్షుడిగా డాక్టర్ కుమార్ డుంగ్రోత్, ప్రధాన కార్యదర్శిగా పొన్నం కవిత, కోశాధికారిగా పగిడిపల్లి ఉమాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా డాక్టర్ కందుల నాగరాజు, ఉపాధ్యక్షుడిగా డాక్టర్ పి.శ్రీకాంత్‌తో పాటు 48 మంది కోర్ కమిటీ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. చిలువేరు సమ్మిగౌడ్ ఫౌండేషన్ చైర్మన్ సమ్మిగౌడ్ జేఏసీ క్యాలెండర్, స్టిక్కర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర కోర్‌కమిటీ సభ్యులు రుక్ముద్దీన్, డాక్టర్ నవీన్‌కుమార్, రాష్ట్ర సోషల్ మీడియా ఇన్‌చార్జ్ మొగిలి నరేష్, రాజ్‌కుమార్, నవీన్, జ్యోతి, అశ్విని, ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.


