శతావధానం సాహసోపేతమైన ప్రక్రియ
మొదటి రోజు
చేపూరి శ్రీరాం శతావధానం..
కేయూ క్యాంపస్: శతావధానం చేయడం సాహసో పేతమైనదేనని, గణిత ఉపాధ్యాయుడు చేపూరి శ్రీ రాం శతావధానంలో విజయసాధిస్తారని ఉపాధ్యా య ఎమ్మెల్సి పింగిళి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. కాకతీ య యూనివర్సిటీ స్వర్ణోత్సవాల వేళ తెలుగు విభా గం, కాకతీయ పద్యకవితా వేదిక సంయుక్త ఆధ్వర్యంలో కేయూ సెనేట్‌హాల్‌లో ఆదివారం చేపూరి శ్రీరాం శతావధానం కార్యక్రమం చేపట్టారు. ము ఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. తెలుగు భాషలోని 56 అక్షరాలను తగ్గించడానికి చేస్తున్న ప్ర యత్నాలను వ్యతిరేకించాలని కోరారు. తెలుగును పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఏ మాధ్యమంలో చదివినా తెలుగు తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. గతంలో చేపూరి శ్రీరాం, తాను ఒకేచోట ఉపాధ్యాయులుగా పనిచేశామని గుర్తుచేశారు. తెలుగు పద్యకవిత్వం, సాహిత్యంలో మక్కువను పెంచుకొని శ్రీరాం శతావధా నం చేయడం అభినందనీయమన్నారు. ఏకాగ్రతతో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నామన్నారు.
పద్యకవిత్వంపై పట్టు
అవధానానికి మూలాధారం : రిజిస్ట్రార్
పద్యకవిత్వంపై పట్టు అవధానానికి మూలాధారమని కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం అన్నారు. కేయూలో తొలిసారి తెలుగు విభాగం ఆధ్వర్యంలో శతావధానం చేపట్టడం అభినందనీయమన్నారు. ఇందులో వంద మంది పండితులు వంద ప్రశ్నలకు పద్యరూపంలో సమాధానాలు చెప్పడం గొప్పవిషయం అన్నారు. కేయూ స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ మామిడాల ఇస్తారి తెలుగు భాష వర్ణమాల వైభవం ఎంతో గొప్పదని అభివర్ణించారు. అవధాన విద్యావికాస పరిషత్ అధ్యక్షుడు మరుమాముల దత్తాత్రేయశర్మ మాట్లాడుతూ ఓరుగల్లు బిడ్డ చేపూరి శ్రీ రాం శతావధానం చేయడం అభినందనీయమన్నా రు. ప్రముఖ సామాజిక ఆధ్యాత్మికవేత్త గట్టు మహేశ్‌బాబు మాట్లాడుతూ కాకతీయల కాలం నాటి శతావధానం సంప్రదాయాన్ని పరిరక్షించాలని కో రారు. కాకతీయ పద్యకవితా వేదిక అధ్యక్షుడు కంది శంకరయ్య, హైకోర్టు న్యాయవాది అనంతశర్మ, ఈ సభకు తెలుగు విభాగం అధిపతి మామిడి లింగ య్య అధ్యక్షత వహించారు. కేయూ పాలకమండలి సభ్యుడు చిర్రరాజు, సహృదయ సాహిత్యసాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు జి.గిరిజామనోహరబాబు, అధ్యాపకుడు డాక్టర్ సదాశివ్, కాకతీయ పద్యవేదిక బాధ్యులు సోంబాబుశర్మ మాట్లాడారు. ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్‌రెడ్డి తన గురువు కంది శంకరయ్యను సన్మానించారు.
చేపూరి శ్రీరాం మొదటి రోజు శతావధానానికి ఉపక్రమించారు. ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్‌రెడ్డి సమస్య అనే అంశంపై శంకర, కంకర, వంకర, టింకర అనే పదాలతో విద్యావిధానంపై అవధానం చేయాలని కోరారు. శ్రీరాం అవధానంలో పూరణ చేశారు. ఆతర్వాత పృచ్చకులు (ప్రాశ్నికులు) అవధానంలో భాగంగా సమస్యపై 25 మంది, దత్తపదిపై 25 మంది ప్రశ్నలు సంధించారు. సమస్యలకు శ్రీరాం మొదటి పాదంగా సమాధానాలు పూరించారు. ఈనెల 23న వర్ణన, అశువుపై శతావధానం జరగనుంది. ఈనెల 24న ముగియనుంది.
తెలుగు భాషను పరిరక్షించుకోవాలి
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్‌రెడ్డి
కేయూలో చేపూరిశ్రీరాం
‘శతావధానం’ షురూ
శతావధానం సాహసోపేతమైన ప్రక్రియ


