భ్రూణ హత్యలు నివారించాలి
● కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్
మహబూబాబాద్: మాతా,శిశువు మరణాలను తగ్గించాలని, భ్రూణ హత్యలను నివారించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో గురువారం సీ్త్ర శిశు సంక్షేమ, వైద్య ఆరోగ్యశాఖల అధికారులతో మాతా శిశువు మరణాలు, భ్రూణ హత్యల నివారణపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. క్షేత్రస్దాయిలో ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీ చేయాలని ఆదేశించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని తెలియజేయాలన్నారు. సంబంధిత అధికా రులు సమన్వయంతో కలిసి పని చేస్తేనే మాతా, శిశువు మరణాలు తగ్గడంతో పాటు భ్రూణ హత్యలు నివారించవచ్చన్నారు. చట్టంపై కూడా విస్తృత ప్రచారం చేయాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వాలని, మెనూ పాటించేలా చూడాలని, కేంద్రాలను తనిఖీ చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదన పు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్, డీడబ్ల్యూఓ సబిత, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ నాగవాణి తదితరులు పాల్గొన్నారు.


