మోంథా పరిహారమేది..?
బయ్యారం: జిల్లాలో గత అక్టోబర్‌లో కురిసిన మోంథా తుపాను ప్రభావంతో రైతులు సాగుచేసిన పంటలు దెబ్బతిన్నాయి. 3,570.85 హెక్టార్లలో పంట నష్టం జరగగా.. సర్వే చేసిన వ్యవసాయశాఖ అధి కారులు 11,611 మంది రైతులకు రూ.8.82కోట్ల చెల్లించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపా రు. అయితే నాలుగు నెలలు కావొస్తున్నా.. ఇప్పటి వరకు బాధిత రైతులకు పరిహారం చెల్లించలేదు. అసలు డబ్బులు ఇస్తారా లేదా అనే అనుమానాలు రైతులు వ్యక్తం చేస్తున్నారు.
వాగుల ప్రవాహంతో..
గత ఏడాది అక్టోబర్ 28,29వ తేదీల్లో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని ఆకేరు, పాకాల వాగులతో పా టు పలు వాగుల వెంట ఉన్న వరి, మొక్కజొన్న, పత్తి పంటలు నీటమునిగాయి. కొన్ని చోట్ల కోతకు వచ్చిన పంటలు నీట మునగడంతో రైతులకు అపార నష్టం సంభవించింది. దెబ్బతిన్న పంటలను పరి శీలించిన ప్రజాప్రతినిధులు, అధికారులు పరిహారం ఇప్పిస్తామని ప్రకటించారు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి నష్టం వివరాలు నమోదు చేశారు. నివేదికను ప్రభుత్వానికి పంపినప్పటికీ నిధులు విడుదల కాకపోవడంతో రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు.
నీటమునిగిన పంట మధ్యలో కౌలు రైతు విజయ్(ఫైల్)
తుపానుతో 3,570.85 హెక్టార్లలో పంటనష్టం అంచనా
జిల్లాలో 11,611మంది రైతులకు అందని పరిహారం
‘పై ఫొటోలోని రైతు దోమకొండ విజయ్. బయ్యారం సమీపంలోని పాకాల ఏటి ప్రాంతంలో రెండెకరాల భూమి కౌలుకు తీసుకొని వరి పంట సాగు చేశాడు. తుపాను, వరదతో పంట మొత్తం నీటమునిగి పోయింది. దీంతో ఎకరానికి 8 బస్తాల ధాన్యం కూడా దిగుబడి రాలేదు. దీంతో పెట్టిన పెట్టుబడులు కూడా రాలేదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.’
మోంథా పరిహారమేది..?


