సమస్యలతో సతమతం!
మున్సిపాలిటీల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం
మహబూబాబాద్: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో సమస్యలు తిష్టవేశాయి. ఏడాదిపైగా పాలకవర్గాలు లేకపోవడంతో సమస్యలు పేరుకుపోయాయి. నూ తనంగా కొలువుదీరిన పాలకవర్గాలకు సమస్యలు సవాల్‌గా మారాయి. వారు ఇచ్చిన హామీలతో పా టు పారిశుద్ధ్యం, డ్రెయినేజీ, వీధి దీపాలు, తాగునీరు, పందులు, కోతులు, కుక్కల సమస్యలను పరి ష్కరించాల్సి ఉంది. పుర ప్రజలు కూడా తమ కాలనీల్లోని సమస్యలు తీరుతాయని నూతన పాలకవర్గాలపై ఆశలు పెట్టుకున్నారు.
మానుకోట.. సమస్యల కోట
మానుకోట మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా వేధిస్తోంది. సరిపడా కార్మికులు లేకపోవడతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతోంది. చెత్త సేకరణ కోసం వినియోగించే 45వాహనాల్లో సగానికి పైగా మరమ్మతులకు గురికావడంతో వీధుల్లోనే చెత్త పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. కాగా నూతన పాలకవర్గం పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. అలాగే తాగునీరు, అంతర్గత రోడ్లు, కోతులు, పందులు, కుక్కల సమస్యను పరిష్కరించాలి. నివాస గృహాల మధ్య ఉన్న ఖాళీ స్థలాలు దోమలు, పందులకు ఆవాసాలుగా మారాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు.
నిరుపయోగంగా మోడల్ మార్కెట్..
జిల్లా కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ సముదాయ భవనాన్ని 2023లోనే ప్రారంభించారు. ఇటీవల మళ్లీ ఎమ్మెల్యే మురళీనాయక్ పునఃప్రారంభించినా వ్యాపారులు అక్కడ వ్యాపారాలు నిర్వహించడానికి సుముఖంగా లేరు. అలాగే మున్సిపల్ భవన నిర్మాణానికి 2018లో రూ.5 కోట్లు కేటాయించారు. 2018 ఏప్రిల్ 4న శంకుస్థాపన చేశారు. నేటి వరకు 80 శాతం పనులు మాత్రమే పూర్తి చేశారు. మిగిలిన పనులపై పాలకవర్గం దృష్టిపెట్టాల్సి ఉంది.
డంపింగ్ యార్డునే పెద్ద సమస్య..
మున్సిపాలిటీలోని 4వ వార్డు నుంచి గెలిచిన గుగులోత్ జ్యోతి మానుకోట చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఆమె వార్డు పరిధి గాంధీపురంలోని డంపింగ్ యార్డును తరలించాలని కొన్ని సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నారు. చైర్‌పర్సన్ డంపింగ్ యార్డును తొలగించి సమస్య తీరుస్తారని వార్డు ప్రజలు భావిస్తున్నారు. అలాగే విలీన గ్రామాల్లో ఎక్కడి అభివృద్ధి అక్కడే నిలిచిపోయింది. ఆయా గ్రామాలపై పాలకవర్గాలు ప్రత్యేక దృష్టిపెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
మానుకోటలోని 19వ వార్డులో రోడ్డుపై పందుల స్వైరవిహారం
143 మంది పారిశుద్ధ్య కార్మికులు
65,712
మంది
ఓటర్లు
36
వార్డులు
25,000లకు పైగా గృహాలు
45 చెత్త సేకరణ
వాహనాలు
లక్షకుపైగా జనాభా
●
అస్తవ్యస్తంగా డ్రెయినేజీలు, రోడ్లు
పందులు, కోతులు, కుక్కలతో పుర ప్రజల ఇబ్బందులు
విలీన గ్రామాల పరిస్థితి మరీ దారుణం
నూతన పాలకవర్గాలపైనే ఆశలు
సమస్యలతో సతమతం!
సమస్యలతో సతమతం!
సమస్యలతో సతమతం!
సమస్యలతో సతమతం!


