గాలివానకు నేలవాలిన మొక్కజొన్న
గూడూరు: మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో బుధవారం ఈదురుగాలులతో కూడి న అకాల వర్షం కురిసింది. దీంతో చేతికి వచ్చిన మొక్కజొన్న పంటలు నేలవాలాయి. అధికంగా వెంగంపేట, దస్రుతండా, సీతానగరం గ్రా మాల్లో మొక్కొజొన్న పంటలు నేలవాలాయి. దీంతో రైతులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
గాలి వాన బీభత్సం..
కొత్తగూడ: మండలంలో బుధవార గాలివాన బీభత్సం సృష్టించింది. ఓటాయి గ్రామంలో కరెంట్ స్తంభాలు విరిగిపోయాయి. ఆసమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అప్రమత్తమైన ట్రాన్స్‌కో సిబ్బంది కొత్త స్తంభాలు వేసి విద్యుత్ పునరుద్ధరించారు. కొత్తపల్లి, కొత్తగూడ, రౌతుగూడెం, వేలుబెల్లి, పెగడపల్లి, పొగుళ్లపల్లి గ్రామాల్లో మక్కజొన్న పంటలు నేలవాలాయి. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరారు.
దెబ్బతిన్న మొక్కజొన్న
కేసముద్రం: గాలిదుమారంతో మొక్కజొన్న పంట నేలవాలిన సంఘటన మండలంలోని ఉప్పరపల్లి, వెంకటగిరి గ్రామాల్లో బుధవారం సాయంత్రం జరిగింది. గాలిదుమారంతో పాటు కాసేపు అకాల వర్షం కురిసింది. దీంతో ఆయా గ్రామాల్లో మొక్కజొన్న పంట నేలమట్టమైంది.
గాలివానకు నేలవాలిన మొక్కజొన్న


