పరిజ్ఞానాన్ని రైతులకు వివరించాలి | - | Sakshi
Sakshi News home page

పరిజ్ఞానాన్ని రైతులకు వివరించాలి

Feb 21 2026 7:38 AM | Updated on Feb 21 2026 7:38 AM

పరిజ్ఞానాన్ని రైతులకు వివరించాలి

పరిజ్ఞానాన్ని రైతులకు వివరించాలి

డీఏఓ బి.సరిత

మహబూబాబాద్‌ రూరల్‌: ఇన్‌పుట్‌ డీలర్లు శిక్షణలో నేర్చుకున్న విషయ పరిజ్ఞానాన్ని రైతులకు తెలియజేయాలని డీఏఓ బి.సరిత అన్నారు. దేశీ ఇన్‌పుట్‌ డీలర్ల 2025–26 కోర్సు శిక్షణను మహబూబాబాద్‌ రైతు వేదిక కార్యాలయంలో శుక్రవారం ప్రారంభించారు. డీఏఓ బి.సరిత శిక్షణను ప్రారంభించి మాట్లాడారు. జిల్లా నుంచి ఎంపికై న 40మంది అగ్రి ఇన్‌పుట్‌ డీలర్లకు 48 ారాల పాటు వ్యవసాయ, అనుబంధ రంగాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. వారంలో ఒకరోజు చొప్పున 40వారాలు తరగతి శిక్షణ, ఎనిమిది క్షేత్ర సందర్శనలు చేపట్టి, పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి డిప్లొమా సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారని పేర్కొన్నారు. కేవీకే మల్యాల ప్రధాన శాస్త్రవేత్త బి.దిలీప్‌ కుమార్‌, వ్యవసాయ సహాయక సంచాలకుడు అజ్మీరా శ్రీనివాసరావు, ఏఓ తిరుపతిరెడ్డి, ఏఓ టెక్నికల్‌ రాంజీ, కురవి ఏఓ నరసింహారావు, దేశీ ప్రోగ్రాం బ్యాచ్‌ ఫెసిలిటేటర్‌ రామచంద్రరావు, వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, ఇన్‌ పుట్‌ డీలర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement