డిప్యూటీ సీఈఓ, ఎంపీడీఓలకు పదోన్నతి | - | Sakshi
Sakshi News home page

డిప్యూటీ సీఈఓ, ఎంపీడీఓలకు పదోన్నతి

Feb 25 2026 9:45 AM | Updated on Feb 25 2026 9:45 AM

డిప్య

డిప్యూటీ సీఈఓ, ఎంపీడీఓలకు పదోన్నతి

హన్మకొండ: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న డిప్యూటీ సీఈఓలు, ఎంపీడీఓలకు పదోన్నతి లభించింది. నలుగురు డిప్యూటీ సీఈఓలు ముఖ్య కార్యనిర్వహణాధికారులుగా, ఐదుగురు ఎంపీడీఓలు డిప్యూటీ సీఈఓలుగా ప్రమోషన్‌ పొందారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హనుమకొండ జెడ్పీ డిప్యూటీ సీఈఓ బి.రవి, జనగామ డీఆర్‌డీఓ ఎన్‌.వసంత, జనగామ జెడ్పీ డిప్యూటీ సీఈఓ డి.సరిత, హనుమకొండ జిల్లా హసన్‌ పర్తి ఈటీసీ ప్రిన్సిపాల్‌ కౌసల్యదేవికి ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పదోన్నతి లభించింది. అదే విధంగా హనుమకొండ జిల్లా పరకాల ఎంపీడీఓ బి.రవీందర్‌, వేలేరు ఎంపీడీఓ ఆర్‌.లక్ష్మి ప్రసన్న, జనగామ జిల్లా కొడకండ్ల ఎంపీడీఓ పి.నాగశేషాద్రి, జనగామ డీఆర్‌డీఏ ఏపీడీ జి.చంద్రశేఖర్‌, మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ ఎంపీడీఓ డి.శ్రీనివాస రావుకు డిప్యూటీ సీఈఓగా పదోన్నతి లభించింది.

బాలికల ధర్నా ఘటనపై విచారణ

పాలకుర్తి టౌన్‌ : మండలంలోని గూడూరు బా లికల గురుకుల పాఠశాల, కళాశాలలో నాణ్య మైన భోజనం అందించడం లేదని ఈనెల 23న బాలికలు ధర్నా చేపట్టిన విషయం విదితమే. ఈ ఘటనపై మంగళవారం గిరిజన గురుకులాల డిప్యూటీ సెక్రటరీ డీఎస్‌ వెంకన్న విద్యార్థుల నుంచి వివరాలు సేకరించారు. పాత, కొత్త బియ్యం తేడాతో భోజనం తయారీలో జాప్యం జరిగిందని విచారణలో తేలిందన్నారు. గురుకుల పాఠశాలలో ఎలాంటి క్షుద్ర పూజలు జరగలేదన్నారు. సేవాలాల్‌ జయంతి సందర్భంగా ప్రిన్సిపాల్‌ తన చాంబర్‌లో వేడుకలు నిర్వహించిందని తెలిపారు. క్షుద్ర పూజల పేరుతో వస్తున్న అపోహలను బాలికలు నమ్మొద్దన్నారు. విచారణ నివేదికను గురుకుల సెక్రటరీతోపాటు కలెక్టర్‌కు సమర్పిస్తామని తెలిపా రు. వారి ఆదేశాల మేరకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

డిప్యూటీ సీఈఓ,  ఎంపీడీఓలకు పదోన్నతి
1
1/1

డిప్యూటీ సీఈఓ, ఎంపీడీఓలకు పదోన్నతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement