కదలరు.. మెదలరు
న్యూస్‌రీల్
శనివారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
● పోలీస్‌శాఖలో సుదీర్ఘకాలంగా ఒకే ప్రాంతంలో పోస్టింగ్
● పట్టణ పరిసర ప్రాంతంలోనే తిష్ట
● పరిచయాలతో నేరాల ఛేదనలో నిర్లక్ష్యం
● బదిలీల ప్రచారంతో అనుకూల ప్రాంతాలకు ప్రయత్నాలు
సాక్షి, మహబూబాబాద్: పోలీస్‌శాఖలో కొందరు అధికారులు ఒకే ప్రాంతంలో సుదీర్ఘకాలంగా పనిచేస్తూ.. కదలకుండా.. మెదలకుండా ఉంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. అయితే ఎక్కువ కాలంలో ఒకే ప్రాంతంలో పనిచేసిన పరిచయాలు పెరిగి.. నేరాలను ఛేదించడంలో వెనకబడి ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల తర్వాత బదిలీల ప్రక్రియ ఉంటుందనే వార్తలు రావడంతో తమకు అనుకూలమైన ప్రాంతాలకు ట్రాన్స్‌పర్ చేయించుకునేందుకు పలువురు అధికారులు ప్రజాప్రతినిధుల వద్ద పైరవీలు మొదలు పెడుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
సుదీర్ఘకాలంగా తిష్ట..
చట్టం దృష్టిలో అందరూ సమానమే.. అందుకోస మే స్నేహం, బంధుప్రీతి ఉండవద్దనే ఆలోచనతో ఎస్సైలను రెండేళ్లు లేదా ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకొని మరికొంత కాలం కొనసాగించే అవకాశం ఉంది. అయితే జిల్లాలో మాత్రం కొందరు అధికారులు సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నట్లు ఆరోపణలు ఉ న్నాయి. జిల్లాలోని రెండు సబ్ డివిజన్లు, ఎనిమిది సర్కిల్ ఆఫీసులు, 19 పోలీస్ స్టేషన్లు, డీసీఆర్‌బీ, ఐటీ కోర్, సీసీఎస్, ఎస్పీ, ఇంటెలిజెన్స్, టాస్క్ ఫోర్స్ మొదలైన విభాగాలకు కానిస్టేబుళ్లు, ఎస్సైలు, సీఐలు, డీఎస్పీ స్థాయి అధికారులు ఉంటారు. అయితే ఇందులో ఎస్సై పోస్టుల వరకు స్థానిక ఎస్పీ పరిధికి లోబడే బదిలీలు ఉండడంతో.. అధికారుల అనుకూలత అధారంగా పోస్టింగ్‌లు వచ్చే అవకాశం ఉంది. దీనిని అడ్డుపెట్టుకొని కొందరు అధికారులు జిల్లాలోని పనిచేస్తున్న ప్రాంతానికి సమీపంలోని స్టేషన్లకే బదిలీ చేయించుకోవడం.. కొంతకాలం తర్వాత మళ్లీ అదే పోస్టుకు రావడం పరిపాటిగా మారిందనే ప్రచారం.
పరిచయాలు పెరగడంతో..
జిల్లాలోని కొన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో సుదర్ఘీకాలంగా పలువురు అధికారులు, సిబ్బంది పనిచేయడంతో అక్కడ పరిచయాలు పెరిగి.. పోలీసింగ్‌లో ఇబ్బందులు అవుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. సాధారణ వ్యక్తుల నుంచి రాజ కీయ నాయకులు, వారి అనుచరులు, బెల్లం, బి య్యం, మట్టి, ఇసు క, కల ప, గంజాయి మొదలైన వ్యాపారులతో పరిచయాలు పెరిగి.. నేరాలు జరిగినప్పుడు కూ డా పట్టించుకోకపోవడ ం.. మామూళ్లు తీసుకొని మౌన ంగా ఉండడం, తప్పని పరిస్థితి అయితేనే కేసులు నమోదు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అలాగే సమీపంలోని పాత, కొత్త పోస్టుల్లో పనిచేయడంతో.. పరిధి దాటి పనిచేయడం, పరిధి విషయంలో పలు స్టేషన్ల ఉద్యోగుల మధ్య వాగ్వాదం జరగడం, అది కాస్త ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లిన ఘటనలు ఉన్నట్లు ప్రచారం.
బదిలీల వార్తతో పైరవీలు..
ఇటీవల గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలు పూర్తి అయిన నేపథ్యంలో జిల్లాలోని పోలీసు అధికారుల బదిలీలు అనివార్యం అనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ సమీప స్టేషన్‌లోనే పోస్టింగ్ తెచ్చుకునేందుకు పైరవీలు మొదలు పెట్టినట్లు తెలిసింది. అయితే జిల్లా ఉన్నతాధికారి మాత్రం ఈ విషయంపై అధికారులందరి సర్వీస్ వివరాలు సేకరించి నిర్ణయం తీసుకునేందుకు సిద్ధం అవుతున్నట్లు ప్రచారం. ఈ పరిస్థితిలో బదిలీలు ఉంటాయో.. ఉంటే ఏ విధంగా జరుగుతాయో.. కొత్త సార్ మార్కు ఎలా ఉంటుందో అనేది పోలీస్ శాఖతోపాటు, జిల్లా ప్రజల్లో కూడా చర్చ జరుగుతోంది.
కదలరు.. మెదలరు
కదలరు.. మెదలరు


