మావోయిస్టుల కంచుకోట కాల్వపల్లి | - | Sakshi
Sakshi News home page

మావోయిస్టుల కంచుకోట కాల్వపల్లి

Feb 25 2026 9:45 AM | Updated on Feb 25 2026 9:45 AM

మావోయిస్టుల కంచుకోట కాల్వపల్లి

మావోయిస్టుల కంచుకోట కాల్వపల్లి

పలు కారణాలతో ఉద్యమబాట పట్టిన పలువురు గ్రామస్తులు

ఎస్‌ఎస్‌తాడ్వాయి : కాల్వపల్లి.. మావోయిస్టుల కంచుకోట. ములుగు జిల్లా ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండలంలోని ఓ కుగ్రామం. ఇక్కడి నుంచి పలు కారణాలతో పలువురు గ్రామస్తులు మావోయిస్టు ఉద్యమ బాట పట్టారు. గతంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో ఏడుగురు మృతి చెందారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన చివరి వ్యక్తి, మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్‌ అలియాస్‌ చొక్కారావు మంగళవారం తెలంగాణ డీజీపీ శివధర్‌ రెడ్డి ఎదుట లొంగిపోయారు. దీంతో ఉద్యమ బాటలో కాల్వపల్లి ప్రస్థానం ముగిసింది. దామోదర్‌.. ఇంటర్మీడియట్‌ చదువుతున్న సమయంలో 1996లో పీపుల్స్‌వార్‌ పార్టీలో చేరి దళ సభ్యుడిగా మొదలు.. అంచలంచెలుగా మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి స్థాయికి ఎదిగారు. అయితే ఎక్కడ ఎన్‌కౌంటర్‌ జరిగిన గ్రామస్తుల గుండెల్లో గుబులు పుట్టెది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటుతోపాటు ప్రస్తుత పరిణామాల కారణంగా దామోదర్‌ 30 ఏళ్ల అజ్ఞాత జీవితం వీడి పో లీసుల ఎదుట లొంగిపోయాడు. దీంతో గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అజ్ఙాతం వీడి న దామోదర్‌ ప్రజాక్షేత్రంలో సమస్యల పరిష్కారంలో ముందుడాలని గ్రామస్తులు పేర్కొంటున్నారు.

ఎన్‌కౌంటర్‌లో ఏడుగురి మృతి

ఉద్యమానికి ఉపిరిగా నిలిచిన కాల్వపల్లి గ్రామానికి చెందిన ఏడుగురు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. బడే నాగేశ్వర్‌రావు అలియాస్‌ ప్రభాకర్‌, బడే మురళి, సిద్ధబోయిన సారక్క, కొప్పుల పాపారావు, రొక్కలి అశోక్‌, సిద్ధబోయిన అశోక్‌, గౌరబోయిన ఉర్మిళ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. ఈ క్రమంలో అజ్ఞాతంలో ఉన్న దామోదర్‌ ప్రస్తుతం లొంగిపోవడంతో మావోయిస్టు ఉద్యమంలో కాల్వపల్లి ప్రస్థానం ముగిసింది.

కాల్వపల్లి గ్రామం

గతంలో వివిధ ఎన్‌కౌంటర్లలో

ఏడుగురి మృతి

గ్రామంలో చివరి వ్యక్తి బడే దామోదర్‌ అలియాస్‌ చొక్కారావు

30ఏళ్ల అజ్ఞాతం వీడి

జనజీవన స్రవంతిలోకి..

ఆయన లొంగుబాటుతో గ్రామంలో హర్షాతిరేకాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement