ప్రేమకు నిలువెత్తు రూపమై.. | - | Sakshi
Sakshi News home page

ప్రేమకు నిలువెత్తు రూపమై..

Feb 23 2026 8:59 AM | Updated on Feb 23 2026 8:59 AM

ప్రేమకు నిలువెత్తు రూపమై..

ప్రేమకు నిలువెత్తు రూపమై..

దేవరుప్పుల: భాగస్వామి చనిపోతే విగ్రహం ఏర్పాటు చేయడం అక్కడక్కడా చూస్తుంటాం. భార్య మరణాన్ని తట్టుకోలేక విగ్రహం ఏర్పాటు చేసిన ఓ భర్త.. ఆమె పక్కనే నేనుండాలి అంటూ తన విగ్రహం పెట్టుకున్నాడు జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చిప్పరాళ్లబండ తండాకు చెందిన భూక్య నానునాయక్‌. ఆయనకు దస్లీతో వివాహమై అరవై ఏళ్లు అయ్యింది. ఆమె ఏడాదిన్నర క్రితం కన్నుమూసింది. భార్య భౌతికంగా లేకపోయినా.. జ్ఞాపకమై నిలవాలని తన వ్యవసాయ భూమిలో దస్లీ విగ్రహాన్ని పెట్టాడు నానూ నాయక్‌. ఏనాటికై నా ఆమె ధరిచేరతానని.. బతుకులోనూ, మరణంలోనూ, చివరికి విగ్రాహాల్లోనూ ఆమెకు తోడుగా ఉండాలని భావించాడు. బతికుండగానే తన విగ్రహాన్ని తయారు చేయించి దస్లీ విగ్రహం పక్కన ముసుగేసి ఉంచాడు. తన మరణానంతరం విగ్రహాన్ని ఆవిష్కరించాలని సంతానాన్ని కోరాడు. కోరాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement