సేవాలాల్‌ మార్గం అనుసరణీయం | - | Sakshi
Sakshi News home page

సేవాలాల్‌ మార్గం అనుసరణీయం

Feb 25 2026 9:45 AM | Updated on Feb 25 2026 9:45 AM

సేవాల

సేవాలాల్‌ మార్గం అనుసరణీయం

ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌

ఘనంగా సేవాలాల్‌ జయంతి

మహబూబాబాద్‌ రూరల్‌ : సమాజాన్ని జాగృతం చేసిన సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ చూపిన మార్గంలో ప్రతీ ఒక్కరు పయనించాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌ అన్నారు.సేవాలాల్‌ 287వ జయంతిని మంగళవారం అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం నుంచి అనంతాద్రి సేవాగఢ్‌ ప్రాంగణం వరకు ర్యాలీ చేపట్టి సేవాలాల్‌ సన్నిధిలో భోగ్‌ బండారో సమర్పించి పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడు తూ.. మేడారం గిరిజన సమ్మక్క–సారక్క జాతర తరహాలో సేవాల్‌ జయంతిని కూడా నిర్వహిస్తామన్నారు. హిందూధర్మం గొప్పతనం బంజారాలకు తెలియజేయడానికి జన్మించిన మహానుభావుడు సేవాలాల్‌ అని కొనియాడారు. హింస పాపమని, మత్తు, ధూమపానం శాపమని హితవుపలికి బంజారా జాతికేకాదు ఇతర కులాలకు ఆదర్శపురుషుడయ్యారని కొనియాడారు. అనంతారంలో సేవాలాల్‌ గుడి నిర్మాణానికి కృషి చేసి, గిరిజనులకు అంకితం చేస్తామన్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దంపతులు గుగులోతు జ్యోతి–రమేష్‌, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ మదన్‌ గోపాల్‌ లోయ, డీటీడీఓ దేశీరాంనాయక్‌, సేవాలాల్‌ జయంతి ఉత్సవాల ప్రత్యేక అధికారి జి.మరియన్న, డాక్టర్‌ బానోత్‌ నెహ్రూరాథోడ్‌, అజ్మీరా సురేష్‌ నాయక్‌, ఘనపురపు అంజయ్య, గుగులోత్‌ కిషన్‌ నాయక్‌, ధరావత్‌ వెంకన్ననాయక్‌, గుగులోత్‌ హరినాయక్‌, కున్సోత్‌ హట్యానాయక్‌, డాక్టర్‌ రాజుకుమార్‌ జాదవ్‌, ధారా వత్‌ భాస్కర్‌ నాయక్‌, నియోజకవర్గంలోని తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.

సేవాలాల్‌ మార్గం అనుసరణీయం1
1/1

సేవాలాల్‌ మార్గం అనుసరణీయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement