నామమాత్రంగా వైద్య సేవలు | - | Sakshi
Sakshi News home page

నామమాత్రంగా వైద్య సేవలు

Feb 23 2026 8:58 AM | Updated on Feb 23 2026 8:58 AM

నామమా

నామమాత్రంగా వైద్య సేవలు

నామమాత్రంగా వైద్య సేవలు

డోర్నకల్‌: జిల్లాలోని డోర్నకల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు నామమాత్రంగా అందుతుండడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అరకొర వసతులు, వైద్యులు, సిబ్బందితో రోగులకు సేవలు అందడం లేదు. పీహెచ్‌సీలో న లుగురు వైద్యులు ఉండాలి. కానీ, ఇద్దరు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ వైద్య సేవలు అందించాల్సిన డాక్టర్‌ ఉస్మాన్‌ గంధంపల్లి, డాక్టర్‌ వరుణ్‌ కంబాలపల్లి పీహెచ్‌సీకి డిప్యుటేషన్‌పై వెళ్లారు. ఇటీవల పీహెచ్‌సీకి మరో వైద్యుడిని నియమించారు. దంత వైద్యుడితో పాటు సీహెచ్‌ఓ, హెడ్‌ నర్సు, పీహెచ్‌ఎన్‌ పోస్టులు చాలాకాలంగా ఖాళీగా ఉన్నా యి. ఒక్కో వైద్యురాలు 24గంటల చొప్పున విధులు నిర్వర్తిస్తున్నా.. రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందడం లేదు.

ఆదివారం మరీ దారుణం..

ఆదివారం వైద్యులతో పాటు సిబ్బంది సెలవులో ఉండడంతో రోగులకు సేవలు అందలేదు. స్టాఫ్‌ నర్సు మాత్రమే విధుల్లో ఉండడంతో రోగులు ప్రైవే ట్‌ ఆస్పత్రులను ఆశ్రయించారు. బీపీ, షుగర్‌ పరీక్షలతో పాటు ఇతర పరీక్షలు కూడా చేయలేదని రోగులు చెప్పారు. పీహెచ్‌సీ స్థాయి కావడంతో ఈసీజీ, మానిటర్లు ఇతర పరికరాలు లేక అత్యవసర వైద్య సేవలు అందడం లేదు. రాత్రి వేళల్లో పీహెచ్‌సీలో స్టాఫ్‌ నర్సు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారని రోగులు చెబుతున్నారు. కాగా, రాత్రి వేళల్లో విధులు నిర్వర్తిస్తున్న తమకు రక్షణపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని మహిళా సిబ్బంది వా పోతున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి పీహెచ్‌సీలో వైద్యులు, సిబ్బందిని నియమించి రోగులకు అన్ని రకాల వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

డోర్నకల్‌ పీహెచ్‌సీలో అరకొరగా సేవలు

నామమాత్రంగా వైద్య సేవలు1
1/1

నామమాత్రంగా వైద్య సేవలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement