డెస్క్ జర్నలిస్టులందరికీ
అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి
హనుమకొండ అర్బన్: డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని వివిధ జర్నలిస్ట్ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండలోని కలెక్టరేట్ ఎదుట డెస్క్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ(డీజేఎఫ్‌టీ) ఆధ్వర్యంలో డెస్క్ జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఆందోళనకు టీయూడబ్ల్యూజే(ఐజేయూ), టీయూడబ్ల్యూజే–143, జర్నలిస్టుల ఫెడరేషన్ యూనియన్ల నాయకులు సంఘీభావం తెలిపి మాట్లాడారు. 252 జీఓను సవరించి డెస్క్ జర్నలిస్టులందరికీ గతంలో జారీ చేసినట్లుగానే అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎడిషన్ కేంద్రంలో నాలుగు మాత్రమే కార్డులు ఇస్తామని జీఓలో పేర్కొనడంతో సబ్ ఎడిటర్లకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. అనంతరం కలెక్టర్ స్నేహ శబరీష్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే–143 రాష్ట్ర ఉపాధ్యక్షుడు లెనిన్, హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు మస్కపురి సుధాకర్, అర్షం రాజ్‌కుమార్, కోరుకొప్పుల నరేందర్, వాంకే శ్రీనివాస్, ఐజేయూ రాష్ట్ర నాయకులు గాడిపల్లి మధు, గడ్డం కేశవమూర్తి, హనుమకొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గడ్డం రాజిరెడ్డి, తోట సుధాకర్, తెలంగాణ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి బొక్క దయాసాగర్, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, కోశాధికారి బొల్ల అమర్, బాధ్యులు బొడిగె శ్రీను, అల్లం రాజేశ్‌వర్మ డెస్క్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.
హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ఆందోళన
మద్దతు తెలిపిన జర్నలిస్టు యూనియన్లు


