శివాజీ మహరాజ్‌ స్ఫూర్తితోనే సర్జికల్‌ స్ట్రైక్‌ | - | Sakshi
Sakshi News home page

శివాజీ మహరాజ్‌ స్ఫూర్తితోనే సర్జికల్‌ స్ట్రైక్‌

Feb 20 2026 6:35 AM | Updated on Feb 20 2026 6:35 AM

శివాజ

శివాజీ మహరాజ్‌ స్ఫూర్తితోనే సర్జికల్‌ స్ట్రైక్‌

రామన్నపేట: ఛత్రపతి శివాజీ చేసిన యుద్ధపోరాట స్ఫూర్తి తోనే ప్రధాని మోదీ మన శత్రుదేశమైనా పాకిస్తాన్‌పై సర్జికల్‌ స్ట్రైక్‌ చేశారని, మన దేశం గర్వించే విధంగా మోదీ పాలన సాగుతోందని హైదరాబాద్‌లోని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు. ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను పురస్కరించుకుని గురువారం హిందు వాహినీ ఆధ్వర్యంలో నగరంలో వాహన ర్యాలీలు నిర్వహించిన అనంతరం కొత్తవాడలోని తోటమైదానంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై హిందు వాహిని కార్యకర్తలను ఉద్దేశించి ఉద్విగ్నభరితంగా ప్రసంగించారు. ప్రతీ వ్యక్తి పుట్టిన 9 నెలల పాటు తల్లి పాలు తాగిన అనంతరం గోవు పాలు తాగుతారని, అలాంటి గోవులను పార్లమెంట్‌లో రాజ్యమాతగా ప్రకటించేలా ప్రతీ హిందువు పోరాటాని సన్నద్ధం కావాలన్నారు. ఛత్రపతి శివాజీ 12 ఏళ్ల వయస్సులోనే గోవును సంహరించడానికి వచ్చిన ముస్లింను అంతమొందించి తన వీరత్వం చాటారన్ని గుర్తు చేశారు. గోమాతను రక్షించే పోలీసులు సైతం తమను దుర్బాషలాడారని, పోలీసు కేసులకు సైతం భయపడేది లేదని పేర్కొన్నారు. హిందు వాహిని కార్యకర్తల పన్నులతోనే మీకు వేతనాలు వస్తున్నాయని విషయాన్ని మరవద్దని పేర్కొన్నారు. ప్రసంగం ముగిసిన అనంతరం వెళ్లే క్రమంలో త్రిశక్తి పీఠం కూల్చివేత నిర్ణయం తీసుకున్న క్రమంలో దేవాలయ పరిరక్షణ హిందు వాహిని పూర్తి స్థాయి మద్దతు ఉందంటూ ఆ దేవాలయాన్ని సందర్శించి అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ కార్యక్రమంలో హిందు వాహిని కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

శివాజీ మహరాజ్‌ స్ఫూర్తితోనే సర్జికల్‌ స్ట్రైక్‌ 1
1/1

శివాజీ మహరాజ్‌ స్ఫూర్తితోనే సర్జికల్‌ స్ట్రైక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement