విద్యార్థుల సామర్థ్యాల పెంపునకు కృషి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల సామర్థ్యాల పెంపునకు కృషి

Feb 23 2026 8:58 AM | Updated on Feb 23 2026 8:58 AM

విద్య

విద్యార్థుల సామర్థ్యాల పెంపునకు కృషి

మహబూబాబాద్‌ అర్బన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సామర్థ్యాల పెంపునకు కృషి చేయాలని డీఈఓ రాజేశ్వర్‌ అన్నారు. ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పరిశీలనలో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో బీఈడీ కళాశాల విద్యార్థులకు ఎఫ్‌ఎల్‌ఎన్‌పై రెండు రోజుల శిక్షణ తరగతులు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ఈ నెల 25నుంచి 27వ తేదీ వరకు 53మంది బీఈడీ విద్యార్థులు రెండో తరగతి విద్యార్థుల ఎఫ్‌ఎల్‌ఎన్‌ ఫౌండేషన్‌ పరి శీలన, నైపుణ్యాలు, అభ్యసన సామర్థ్యాలను పరిశీలిస్తారన్నారు. రాష్ట్రస్థాయిలో జిల్లా ఎఫ్‌ ఎల్‌ఎన్‌ శాంపిల్‌ స్టడీ నిర్వహించబడుతుందన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో అమలుపర్చి విద్యార్థుల చదువులకు తోడ్పడాలన్నారు. కార్యక్రమంలో కోర్సు కోఆర్డినేటర్‌ అప్పారావు, ఆర్పీలు ప్రవీణ్‌, యాదగిరి, రాష్ట్ర పరిశీలకుడు సురేందర్‌ పాల్గొన్నారు.

ఉత్తమ ఫలితాల

సాధనకు కృషి

మహబూబాబాద్‌ రూరల్‌: విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేస్తున్నామని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి దేశీరాంనాయక్‌ అన్నారు. మహబూబాబాద్‌ మండలంలోని రెడ్యాల గ్రామంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి గుగులోత్‌ దేశీరాంనాయక్‌ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాల గురించి వివరాలు అడిగి తెలుసుకుని, వారితో కలిసి డీటీడీఓ దేశీరాంనాయక్‌, డీపీఆర్‌ఓ రాజేందర్‌ భోజనం చేశారు. ఈ సందర్భంగా డీటీడీఓ మాట్లాడుతూ.. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ప్రత్యేక ప్రణాళికతో జిల్లాలోని 19గిరిజన ఆశ్రమ పాఠశాలలు, ఆరు వసతి గృహాలు, 9 పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టళ్లు, 104 గిరిజన ప్రైమరీ స్కూళ్లలోని విద్యార్థులు వ్యక్తిగతంగా, మానసికంగా దృఢంగా ఉండే విధంగా తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. షెడ్యూలు ప్రకారం వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఉపాధ్యాయుల ద్వారా అత్యుత్తమ విద్యాబోధన జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గెజిటెడ్‌ హెడ్మాస్టర్‌ బానోతు శుక్రునాయక్‌, స్టడీ అవర్స్‌ ఉపాధ్యాయులు ఉన్నారు.

మేడారంలో భక్తుల రద్దీ

ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో గద్దెల ప్రాంగణం భక్తుల రద్దీతో కోలాహలంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం గద్దెల వద్దకు చేరుకుని సమ్మక్క–సారలమ్మకు పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఒడిబియ్యం, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో ప్రధాన ఆర్చ్‌ ద్వారం నుంచి భక్తులను పోలీసులు క్రమపద్ధతిలో దర్శనాలకు పంపించారు. నార్లాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్సై కమలాకర్‌ భక్తుల రద్దీని పర్యవేక్షించి ప్రశాంతంగా దర్శించుకునేలా చర్యలు తీసుకున్నారు. మేడారం కార్యనిర్వహణాధికారి వీరస్వామి కుటుంబ సమేతంగా అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎత్తు బంగారం అమ్మవార్లకు మొక్కుగా సమర్పించారు. సంప్రదాయంగా పూజారులు ఆయనకు డోలివాయిద్యాలతో గద్దెలపైకి స్వాగతం పలికారు. ఆయన వెంట సూపరింటెండెంట్‌ విజయ్‌కుమార్‌, జూనియర్‌ అసిస్టెంట్లు జగదీశ్వర్‌, మధు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

విద్యార్థుల సామర్థ్యాల పెంపునకు కృషి1
1/2

విద్యార్థుల సామర్థ్యాల పెంపునకు కృషి

విద్యార్థుల సామర్థ్యాల పెంపునకు కృషి2
2/2

విద్యార్థుల సామర్థ్యాల పెంపునకు కృషి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement