పేరుకుపోయిన సమస్యలు..
కేసముద్రం: ఇటీవల ఏర్పడిన కేసముద్రం మున్సిపాలిటీలో పేరుకుపోయిన పలు సమస్యలపై నూతనపాలక వర్గం దృష్టిసారించాల్సి న అవసరం ఉంది. వర్షాకాలంలో రైల్వేస్టేషన్‌లో సమీపంలోని అండర్ డ్రెయినేజీ వద్ద వరదనీరు తీవ్రత ఎక్కువ కావడంతో సంతోష్‌నగర్ కాలనీతోపాటు, అంబేడ్కర్ సెంటర్, అమరవీరుల స్తూపం వద్ద ఉన్న దుకాణాలు, ఇళ్లలోకి వరదనీరు చేరడంతో తీవ్రంగా ఆస్తినష్టం వాటిల్లింది. డ్రెయినేజీ మార్గం పక్కన అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్లే వరదనీరు వచ్చిన ప్రతీసారి ఇలాంటి సంఘటనలు తలెత్తుతున్నాయని, అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. రైల్వేస్టేషన్‌కు ఇరువైపులా నుంచి బాటసారులు, ప్రజలు అండర్ డ్రెయినేజీలో నుంచి రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు పడుతున్నారు. 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్లైఓవర్ మీదుగా వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. కాగా, అండర్ బ్రిడ్జి ఏర్పాటుకు ఇప్పటికే అధికారులు స్థల పరిశీలన చేసినప్పటికీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. త్వరితగతిన అండర్‌బ్రిడ్జి నిర్మాణం చేపడితే ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తొలగుతాయి. మున్సిపాలిటీ పరిధిలోని ధన్నసరి, అమీనాపురం, కేసముద్రంవిలేజ్, కేసముద్రంస్టేషన్, సబ్‌స్టేషన్‌తండాలో సైడ్‌కాల్వల్లో మురుగు నిలిచిపోవడంతో దోమలు, పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. అలాగే పలు చోట్ల తాగునీటి సమస్య ఉంది.
రైల్వే అండర్ డ్రైయినేజీ నుంచి రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న ప్రజలు
పేరుకుపోయిన సమస్యలు..


