స్పేస్ ఎడ్యుకేషన్ హబ్‌గా వరంగల్
నయీంనగర్: విద్యార్థుల్లో అంతరిక్ష పరిశోధనలపై మక్కువ పెంచడం, వరంగల్‌ను స్పేస్ ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు నిట్ వరంగల్, ‘కుడా’ ఆధ్వర్యంలో ఎక్స్‌ప్లోరా ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్లు ‘కుడా’చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, వైస్ చైర్‌పర్సన్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. సైన్స్ డే సందర్భంగా ఈనెల 28న ఇస్రో స్పేస్ ట్యూటర్, ఏటీడీఆర్‌ఎల్ స్పేస్ రీసెర్చ్ ల్యాబ్, రిజిస్టర్డ్ ఇస్రో స్పేస్ ట్యూటర్ శశాంక్ భూపతి ఆధ్వర్యంలో రుద్రమ v.01గా నామకరణం చేసిన మోడల్ రాకెట్‌ను హనుమకొండ బాలసముద్రంలోని ‘కుడా’ గ్రౌండ్‌లో ప్రయోగించనున్నట్లు వివరించారు. ఈనెల 18 నుంచి 27 వరకు (సాయంత్రం 6 నుంచి రాత్రి 11గంటలు) భద్రకాళి ట్యాంకుబండ్‌పై టెలిస్కోప్‌తో నక్షత్ర వీక్షణం కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వివరించారు. మేయర్ గుండు సుధారాణి, ఇస్రో నోడల్ సెంటర్ హెచ్‌ఓడీ–నిట్ ప్రొఫెసర్ ఎల్.ఆంజనేయులు మాట్లాడుతూ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కుడా పనిచేస్తోందని తెలిపారు. సమావేశంలో ‘కుడా’సీపీఓ అజిత్‌రెడ్డి, ఈఈ భీంరావు, స్పేస్ ట్యూటర్ శశాంక్ భూపతి తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి ఖగోళాన్ని
వీక్షించే అవకాశం
విద్యారణ్యపురి: భద్రకాళి బండ్‌పై ఈనెల 18 నుంచి 27 వరకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉచితంగా ఖగోళాన్ని వీక్షించవచ్చని డీఈఓ ఎల్వీ గిరిరాజ్‌గౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు తమ గుర్తింపు కార్డు చూపిస్తే వారితోపాటు తల్లిదండ్రులకు కూడా ఉచిత ప్రవేశం కల్పిస్తారని తెలిపారు. ఈనెల 18న హనుమకొండ, 19న కాజీపేట, 20 హసన్‌పర్తి, 21న ఆత్మకూరు, దామెర, వేలేరు, 22న భీమదేవరపల్లి, ధర్మసాగర్, ఎల్కతుర్తి, 23న ఐనవోలు, కమలాపూర్, 24న నడికూడ, పరకాల, శాయంపేట మండలాల విద్యార్థులు టెలిస్కోప్‌తో ఖగోళ దృశ్యాలను వీక్షించే అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
స్పేస్ ఎడ్యుకేషన్ హబ్‌గా వరంగల్


