ప్రజాస్వామ్యయుతంగానే చైర్మన్ ఎన్నిక
● ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
పాలకుర్తి టౌన్: బీఆర్‌ఎస్ పార్టీ అనే క ఎత్తులు జిత్తులు చేసినా తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ప్రజా స్వామ్య యుతంగానే జరిగిందని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ కడియం కావ్య, పీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డితో కలిసి ఆమె మాట్లాడారు. తొర్రూరు మున్సిపాటీ చైర్మన్ ఎన్నిక కోసం బీఆర్‌ఎస్ పార్టీ అనేక ఎత్తులు, జిత్తులు చేసిందని, కాంగ్రెస్ ఆ కుట్రలను తిప్పికొట్టిందన్నారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ మోసాలను ప్రజలు తెలుసుకున్నారని అన్నారు. తొర్రూరు మార్కెట్ చైర్మన్ హనుమాండ్ల తిరుపతిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం నూతన చైర్మన్‌గా ఎన్నికై న తూణం శ్రావన్, కౌన్సిలర్లకు ఎమ్మెల్యే, ఝాన్సీరెడ్డి ఆధ్వర్యంలో అత్మీయ నన్మానం చేశారు. లక్కిడ్రాలో కాంగ్రెస్‌పార్టీ గెలుపొండంతో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెర్డి పార్టీ కార్యకర్తలతో డ్యాన్స్ చేసి సందడి చేశారు.


