రక్తమోడిన రహదారులు.. | - | Sakshi
Sakshi News home page

రక్తమోడిన రహదారులు..

Feb 23 2026 8:59 AM | Updated on Feb 23 2026 8:59 AM

రక్తమ

రక్తమోడిన రహదారులు..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రహదారులు రక్తమోడాయి. ఆదివారం పలుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. ములుగు జిల్లా తాడ్వాయి మండల పరిధిలో ఇద్దరు, జనగామ జిల్లా కొడకండ్ల శివారు వెలిశాల వద్ద ఒకరు, మహబూబూబాద్‌ జిల్లా పెద్దవంగర మండలం గంట్లకుంటలో మరొకరు మృతి చెందారు. దీంతో ఆయా కుటుంబాలు శోకసంద్రంలో మునిగాయి.

ఎస్‌ఎస్‌తాడ్వాయి : మేడారానికి వస్తూ ఒకరు.. మహాజాతరకు వచ్చి వెళ్తూ మరొకరు.. ఇలా రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలంలోని ఇచ్చగూడేనికి చెందిన గుజ్జ కమలాకర్‌(45) బంధువులు మేడారానికి వెళ్లగా ఆయన బైక్‌పై మహాజాతరకు వస్తున్నాడు. ఈ క్రమంలో పస్రా– తాడ్వాయి కొండపర్తి ములుపు వద్ద బైక్‌ అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో కమలాకర్‌ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఘటనలో ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడేనికి చెందిన గార్లపల్లి నవీన్‌(32) బైక్‌పై మేడారం వెళ్లాడు. తిరిగి సాయంత్రం సమయంలో వెళ్తున్న క్రమంలో తాడ్వాయి దాటిన తర్వాత పెద్దమోరి వద్ద వెనుక నుంచి టిప్పర్‌ ఢీకొంది. ఈ ఘటనలో నవీన్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మృతుల కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

బైక్‌పై నుంచి పడి వ్యక్తి..

కొడకండ్ల : బైక్‌ పైనుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన కొడకండ్ల శివారు వెలిశాల హెచ్‌పీ పెట్రోల్‌ పంపు వద్ద చోటుచేసుకుంది. ఎస్సై చింత రాజు కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా తిర్మలగిరి మండలం కోక్యాతండాకు చెందిన గుగులోత్‌ నెహ్రూ(38) కూలీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇందులో భాగంగా పనినిమిత్తం శనివారం బైక్‌పై వెలిశాలకు వెళ్లాడు. రాత్రి స్వగ్రామం బయలుదేరాడు. ఈ క్రమంలో అదే తండా(కోక్యనాయక్‌)కు చెందిన గుగులోత్‌ శంకర్‌ బైక్‌పై వెలిశాల వద్ద అడ్డు వచ్చాడు. దీంతో నెహ్రూ కిందపడగా తీవ్ర గాయాలుకావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

కారు ఢీకొని గంట్లకుంటలో యువకుడు..

పెద్దవంగర: బైక్‌, కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన శనివారం రాత్రి మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రమోద్‌ కుమార్‌ గౌడ్‌ కథనం ప్రకారం.. మండలంలోని గంట్లకుంటకు చెందిన గుర్రం సంతోష్‌ (28) బైక్‌పై శనివారం రాత్రి అవుతాపురం నుంచి స్వగ్రామం వెళ్తున్నాడు. ఇదే సమయంలో స్టేషన్‌ ఘన్‌పూర్‌కు చెందిన దేవసాని దామోదర్‌ కారులో గంట్లకుంట నుంచి పోచంపల్లి వైపునకు ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో ఎదురెదురుగా బైక్‌ను ఢీకొనడంతో సంతోష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి రామ్మూర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

రక్తమోడిన రహదారులు..1
1/2

రక్తమోడిన రహదారులు..

రక్తమోడిన రహదారులు..2
2/2

రక్తమోడిన రహదారులు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement