టిప్పర్‌ను ఢీకొన్న బైక్..
● సెంట్రింగ్ మేసీ్త్ర దుర్మరణం
● చింతగట్టు క్యాంపు వద్ద ఘటన
హసన్‌పర్తి: రోడ్డు ప్రమాదంలో సెంట్రింగ్ మేసీ్త్ర మృతి చెందాడు. చింతగట్టు క్యాంపులోని ఆర్టీఓ కార్యాలయం వద్ద ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. నగరంలోని కోమటిపల్లి తండాకు చెందిన బానోత్ హరిసింగ్(47)కు భార్య, ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. సెంట్రింగ్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం ఆర్వోఆర్ మీదుగా బైక్‌పై చింతగట్టు క్యాంపునకు బయల్దేరాడు. అయితే, ఆర్టీఓ కార్యాలయం సమీపంలో రోడ్డుపై పార్కింగ్ చేసి ఉన్న టిప్పర్ కనిపించలేదు. దీంతో చీకటిలో వెనుక వైపు నుంచి టిప్పర్‌ను ఢీకొన్నాడు. ఈప్రమాదంలో హరిసింగ్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు
కుటుంబ సభ్యుల రాస్తారోకో..
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, తండావాసులు ఆందోళనకు దిగారు. హనుమకొండ–కరీంనగర్ ప్రధాన రహదారిలోని చింతగట్టు క్యాంపు వద్ద రాస్తారోకో చేపట్టడంతో ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను శాంతింపజేశారు.


