వడగండ్ల వాన బీభత్సం.. | - | Sakshi
Sakshi News home page

వడగండ్ల వాన బీభత్సం..

Feb 24 2026 7:34 AM | Updated on Feb 24 2026 7:34 AM

వడగండ

వడగండ్ల వాన బీభత్సం..

మిరి ్చపంటపై కప్పిన కవర్‌పై నిలిచిన వర్షపు నీరు

గాలికి రోడ్డుపై ఎగిరిపడిన టేల డబ్బా

కాళేశ్వరం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంతోపాటు పరిసర ప్రాంతాల్లో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. సోమవారం మధ్యాహ్నం 3గంటలకు సుమారు 20నిమి షాల పాటు భారీ ఈదురుగాలితోకూడిన వడగండ్ల వాన కురిసింది. దీంతో కాళేశ్వరం, పూస్కుపల్లి, మజీద్‌పల్లిలో అక్కడక్కడ చేనుల్లో ఆరబోసిన మిరపపంట తడిసింది. పంటపై కప్పిన కవర్లలో నీరు భారీగా నిలిచింది. మజీద్‌పల్లిలోని వీఐపీ ఘాట్‌ వద్ద చేతికొచ్చిన మొక్కజొన్న పంట నేలకొరిగింది. దీంతో మిర్చి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిళ్లడంతో అన్నదాతల లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. కాగా, పూర్తిస్థాయిలో రైతులు కవర్లు వేసి ఉండడంతో మిరప పంటకు నష్టం ఎక్కువ జరగలేదు.

విద్యుత్‌ తీగలపై విరిగిపడిన చెట్ల కొమ్మలు ..

గాలి వాన బీభత్సానికి బస్టాండ్‌ సమీ పంలోని ఓ టేల డ బ్బా ఎగిరి రోడ్డుపై పడింది. అందులో ఎలాంటి సామగ్రి లేకపోవడం, రోడ్డుపై ప్రజల రాకపోకలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పలు కాలనీల్లో విద్యుత్‌ తీగలపై చెట్ల కొమ్మలు వి రిగిపడ్డాయి. ఇప్పలబోరులో ఇంటిపై రేకులు లేచాయి. కాళేశ్వరాలయంలో మెట్లమార్గం వద్ద రేకులు ఏర్పాటు చేయగా అవి గాలికి ఎగిరి కిందపడ్డా యి. పిడుగుపాటుకు కుంట్లం గ్రామంలో ఓ ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.

పలిమెలలో ఈదురుగాలుల బీభత్సం ..

పలిమెల: మండలంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. లెంకలగడ్డ 33 కేవీ ప్రధాన విద్యుత్‌ లైన్‌ పై చెట్టుకొమ్మలు విరిగిపడడంంతో లెంకలగడ్డ మినహా మండలంలోని అన్ని గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిది. విద్యుత్‌ సిబ్బంది చెట్టును తొలగించి విద్యుత్‌ను పునరుద్ధరించారు. సుమారు నాలుగు గంటల పాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇక్కట్లు పడ్డారు.

తడిసిన పంటను

చూపుతున్న రైతు మల్లయ్య

ఆరబోసిన మిరప పంట నీటి పాలు..

నేలకొరిగిన మొక్కజొన్న

ఆందోళనలో రైతులు

ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు

వడగండ్ల వాన బీభత్సం.. 1
1/4

వడగండ్ల వాన బీభత్సం..

వడగండ్ల వాన బీభత్సం.. 2
2/4

వడగండ్ల వాన బీభత్సం..

వడగండ్ల వాన బీభత్సం.. 3
3/4

వడగండ్ల వాన బీభత్సం..

వడగండ్ల వాన బీభత్సం.. 4
4/4

వడగండ్ల వాన బీభత్సం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement