కలిసికట్టుగా పనిచేస్తేనే అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

కలిసికట్టుగా పనిచేస్తేనే అభివృద్ధి

Feb 24 2026 7:31 AM | Updated on Feb 24 2026 7:31 AM

కలిసికట్టుగా పనిచేస్తేనే అభివృద్ధి

కలిసికట్టుగా పనిచేస్తేనే అభివృద్ధి

మహబూబాబాద్‌: ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేయాలని ఆ తర్వాత రాజకీయాలకతీతంగా మానుకోటను అభివృద్ధి చేసుకునేందుకు కలిసికట్టుగా పనిచేయాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సోమవారం కౌన్సిలర్ల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 36 మంది కౌన్సిలర్లను ఎమ్మెల్యే మురళీనాయక్‌, కమిషనర్‌ రాజేశ్వర్‌ సన్మానించారు. అనంతరం చైర్‌పర్సన్‌ గుగులోత్‌ జ్యోతిరమేష్‌, వైస్‌ చైర్మన్‌ సూర్నపు సోమయ్యను కౌన్సిలర్లు సన్మానించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మురళీనాయక్‌ మాట్లాడుతూ.. ఇటీవల మానుకోటలో రూ.59.62 కోట్ల అబ్ధివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసుకున్నట్లు తెలిపారు. మున్నేరువాగు వద్ద రూ.3 కోట్లతో నిర్మించనున్న బతుకమ్మ ఘాట్‌కు శంకుస్థాపన చేశామని, ఆ నిర్మాణానికి మరో మూడుకోట్ల రూపాయలు విడుదల చేయిస్తామన్నారు. బంధం చెరువును మినీ ట్యాంక్‌ బండ్‌గా చేసేందుకు రూ.7 కోట్లతో పనులకు శంకుస్థాపన చేశామన్నారు. రూ.10 కోట్లతో చేపట్టనున్న ఇంటిగ్రేడ్‌ స్కూల్‌, హైస్కూల్‌ అండ్‌ జూనియర్‌ కళాశాల బాలుర, బాలికల కళాశాల భవనాలకు మార్చిలో సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపనలు చేస్తారన్నారు.

బాధ్యతల స్వీకరణ

మానుకోట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుగులోత్‌ జ్యోతి రమేష్‌, వైస్‌ చైర్మన్‌ సూర్నపు సోమయ్య సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్‌ చైర్మన్‌ చాంబర్‌లో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్‌ మురళీనాయక్‌ హాజరయ్యారు. ఆయా కార్యక్రమాల్లో కమిషనర్‌ రాజేశ్వర్‌, డీఈఈ సీహెచ్‌ ఉపేందర్‌, కౌన్సిలర్లు అజయ్‌సారథిరెడ్డి, ముత్యం వెంకన్న, రాజశేఖర్‌, దిలీప్‌, రవికుమార్‌, నవీన్‌, బోల్లు రాజు, ధనలక్ష్మి, శివకుమార్‌, నాగేశ్వర్‌ రావు, సుధామోహన్‌, డీఈ సీహెచ్‌ ఉపేందర్‌, ఏఈ కుమార్‌ టీపీఓ సాయిరాం, నాయకులు ఘనపురపు అంజయ్య, ప్రవీణ్‌, ఖలీల్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్‌

మానుకోట మున్సిపల్‌ కౌన్సిలర్లకు సన్మానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement