ప్రభుత్వ విద్య పరిరక్షణకు పోరాటం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ విద్య పరిరక్షణకు పోరాటం

Feb 23 2026 8:58 AM | Updated on Feb 23 2026 8:58 AM

ప్రభుత్వ విద్య పరిరక్షణకు పోరాటం

ప్రభుత్వ విద్య పరిరక్షణకు పోరాటం

పెద్దవంగర: ప్రభుత్వ విద్య పరిరక్షణకు టీపీటీఎఫ్‌ పోరాటం చేస్తుందని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి సిద్దోజు కవిత, పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి అధ్యయన తరగతులు నిర్వహించారు. టీపీటీఎఫ్‌ మండల అధ్యక్షుడు చిక్కాల సతీష్‌, కార్యదర్శి వల్లాల శ్రీనివాస్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రెండేళ్లుగా పీఆర్సీ ప్రకటించకపోవడం దురదృష్టకరమని, పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే చెల్లించాలన్నారు. పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు తక్షణమే ఇవ్వాలని కోరారు. హెల్త్‌ కార్డు అమలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కనీసం 20శాతం నిధులు కేటాయించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన అవపరం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బలాష్టి రమేశ్‌, విష్ణువర్ధన్‌ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్‌ సోమారపు ఐలయ్య, నాయకులు సాంబయ్య, ప్రభాకర్‌ గౌడ్‌, జనార్దన్‌, ఉపేందర్‌, రవీందర్‌ రెడ్డి, సబియా బాను, దేవేందర్‌ నాయక్‌, యుగేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement