వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
మరిపెడ: గర్భిణులపట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్ అన్నారు. బుధవారం మరిపెడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానిన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశా రు. మహిళలు గర్భందాల్చిన 12వారాల లోపే తప్పనిసరిగా పేర్లు నమోదు చేసుకునేలా చూడాలని ఆదేశించారు. మొదటి, రెండు పరీక్షలు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, ఆ తర్వాత పరీక్షలు ప్రభు త్వ జనరల్ ఆస్పత్రిలో నిర్వహించాలని సూచించారు. 30ఏళ్లు పైబడిన వారందరికీ బీపీ, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధుల స్క్రీనింగ్ నిర్వహించి అవసరమైన మందులు అందజేయాలన్నారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, ఆన్‌లైన్ పోర్టల్‌లో డేటా అప్‌డేట్ సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. వార్డులో ఉన్న రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి గుగులోతు రవి, డాక్టర్ పూజిత, హెల్త్ ఎడ్యుకేటర్ రాజు, స్టాఫ్ నర్సు మమత పాల్గొన్నారు.
మెరుగైన వైద్య సేవలు అందించాలి..
దంతాలపల్లి: ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రజావైద్యశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవల గురించి వైద్యురాలు కవితను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వార్డుల్లో తిరిగి రోగులతో మాట్లాడారు. సిబ్బందితో మాట్లాడుతూ.. ఆస్పత్రికి వచ్చే రోగులకు చిత్తశుద్ధితో సేవలు అందించాలని, సమయపాలన పాటించాలని సూచించారు. అనంతరం రికార్డులు, ఆస్పత్రిలో పనిచేయని ఇన్వర్టర్లను పరిశీలించి సిబ్బందికి తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి కవిత, వెంకటేశ్వరరాజు, సూపర్‌వైజర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్


