నిరంతర సాధనతో విజయావకాశాలు | - | Sakshi
Sakshi News home page

నిరంతర సాధనతో విజయావకాశాలు

Feb 22 2026 8:19 AM | Updated on Feb 22 2026 8:19 AM

నిరంత

నిరంతర సాధనతో విజయావకాశాలు

వరంగల్‌ స్పోర్ట్స్‌: అంకితభావం, క్రమశిక్షణ, కఠోర శ్రమకు తోడు సరైన శిక్షణ, నిరంతర సాధనతో క్రీడాకారులు విజయ తీరాలకు చేరుకుంటారని ఎన్‌ఐటీ వ్యాయామ విద్య ప్రొఫెసర్‌ రవికుమార్‌ అన్నారు. హనుమకొండలోని జేఎన్‌ఎస్‌లో రెండు రోజులుగా కొనసాగుతున్న సీఎం కప్‌ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఆయన ముఖ్యఅతిథిగా శనివారం హాజరై విజేతలకు పతకాలు, సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా రవికుమార్‌ మాట్లాడుతూ ఆహార నియమావళి పాటిస్తూ వ్యసనాలకు దూరంగా ఉన్నప్పుడే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు అథ్లెటిక్స్‌లో ఘనమైన చరిత్ర ఉందని గుర్తుచేశారు. కార్యక్రమంలో డీవైఎస్‌ఓ గుగులోతు అశోక్‌ కుమార్‌, అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ బాధ్యులు సారంగపాణి, వెంకటేశ్వర్‌ రెడ్డి, కిషన్‌, మహేష్‌బాబు, సీఏ రాజు, ట్రైబల్‌ వెల్ఫేర్‌ క్రీడాధికారి కిస్టు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో

జిల్లాక్రీడాకారుల ప్రతిభ

ఖమ్మంస్పోర్ట్స్‌: ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ కళాశాల మైదానంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న సీఎం కప్‌ అండర్‌–19 బాలబాలికల రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీల్లో వరంగల్‌ క్రీడాకారులు ప్రతిభ కనబర్చారు. రికర్వ్‌ బాలుర విభాగంలో ఏ.వెంకటేష్‌ వెండి పతకం గెలుచుకున్నారు. రికర్వ్‌ బాలికల విభాగంలో బి.కృపారాణి ప్రతిభ చాటారు.

నిట్‌ ప్రొఫెసర్‌ రవికుమార్‌

నిరంతర సాధనతో విజయావకాశాలు1
1/3

నిరంతర సాధనతో విజయావకాశాలు

నిరంతర సాధనతో విజయావకాశాలు2
2/3

నిరంతర సాధనతో విజయావకాశాలు

నిరంతర సాధనతో విజయావకాశాలు3
3/3

నిరంతర సాధనతో విజయావకాశాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement