కాంగ్రెస్‌ది దుర్మార్గపు పాలన
హన్మకొండ: రాష్ట్రంలో కాంగ్రెస్ దుర్మార్గపు పాలన కొనసాగుతోందని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మధుసూదనాచారి ముఖ్య అతిథి గా హాజరై మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్ భాస్కర్‌తో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి వెళ్తే కుర్చీ వస్తుందోననే ఒకే ఆలోచన విధానం రేవంత్ రెడ్డికి ఉందని విమర్శించారు. తెలంగాణ మరోసారి ఆగమయ్యే పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడంతోపాటు, ప్రజ లకు మేలు చేసే కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో తిరిగి రావడం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ దుర్మార్గాన్ని చీల్చి చెండాలన్నారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు కోసం ఉద్యమం చేపట్టి సాధించే వరకు విశ్రమించని గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కుర్చీపై ఎలా కూర్చోవాలన్నదే రేవంత్ విధానం
శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి


