ఇంటర్‌ పరీక్షలు షురూ.. | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ పరీక్షలు షురూ..

Feb 26 2026 8:40 AM | Updated on Feb 26 2026 8:40 AM

ఇంటర్

ఇంటర్‌ పరీక్షలు షురూ..

మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లాలో ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తెలుగు, ఉర్దూ, హిందీ, సంస్కృతం పరీక్షలకు 3,317మంది విద్యార్థులకు 3,237 మంది హాజరై 80 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌ విద్యార్థులు 1,042 మందికిగాను 955 మంది హాజరై, 87మంది గైర్హాజరయ్యారు.

వారికి నోఎంట్రీ..

మానుకోట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పరీక్ష కేంద్రానికి ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాల విద్యార్థి (ఎంపీహెచ్‌) ఉదయం 09: 10గంటలకు రావడంతో.. ఆలస్యమైందని అనుమతి ఇవ్వలేదు. దీంతో విద్యార్థి వెనుదిరిగి వెళ్లాల్సి వచ్చింది. ప్రభుత్వ బాలికల కళాశాల పరీక్ష కేంద్రానికి ఓ విద్యార్థి ఆలస్యంగా వచ్చి వెనుదిరగాల్సి వచ్చింది.

అధికారుల తనిఖీ..

మరిపెడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలోని పరీక్ష కేంద్రాన్ని అదనపు కలెక్టర్‌ లెనిన్‌ వత్సల్‌ టొప్పో పరిశీలించారు. మానుకోట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలురు, బాలికల కళాశాలల్లోని పరీక్ష కేంద్రాలను డీఐఈఓ మదార్‌గౌడ్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలో పరీక్ష చీఫ్‌ సూపరింటెండెంట్‌ను ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు పరీక్ష రాసిన తీరును, వారి ప్రశ్న, జవాబు పత్రాలను పరిశీలించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు గురించి అడిగి తెలుసుకున్నారు. జిల్లా పరీక్షల నియంత్రణ అధికారులు ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో తనిఖీ చేశారు. బయ్యారం, గార్ల, డోర్నకల్‌లోని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షల్లో ఎలాంటి లోపాలు రావొద్దని సిట్టింగ్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లకు సూచించారు. మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలను అనుమతించొద్దని సూచించారు. విద్యార్థులకు అన్నిసౌకర్యాలు సక్రమంగా ఉండేలా చూడాలన్నారు.

వైద్యశిబిరాలు..

జిల్లావ్యాప్తంగా జరుగుతున్న ఇంటర్‌ పరీక్ష కేంద్రాల వద్ద కలెక్టర్‌ ఆదేశాల మేరకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఎలాంటి అస్వస్థతకు గురైనా వెంటనే స్పందించేందుకు వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు అందుబాటులో ఉన్నారు. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, మందులు సిద్ధంగా ఉంచారు. జిల్లా వైద్యశాఖ అధికారులు పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేశారు.

సెంటర్లను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్‌, డీఐఈఓ

4,359 మంది విద్యార్థులకు 4,192 మంది హాజరు

167మంది గైర్హాజర్‌

ఇంటర్‌ పరీక్షలు షురూ..1
1/3

ఇంటర్‌ పరీక్షలు షురూ..

ఇంటర్‌ పరీక్షలు షురూ..2
2/3

ఇంటర్‌ పరీక్షలు షురూ..

ఇంటర్‌ పరీక్షలు షురూ..3
3/3

ఇంటర్‌ పరీక్షలు షురూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement