ఉద్రిక్తత.. ఉత్కంఠ
సాక్షి, మహబూబాబాద్/డోర్నకల్/తొర్రూరు: జిల్లాలోని డోర్నకల్ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నిక సాఫీగా జరుగగా.. తొర్రూరు మున్సిప ల్ చైర్మన్ ఎన్నిక మాత్రం ఉత్కంఠభరితంగా సాగింది. లాటరీ పద్ధతిన చైర్మన్, వైస్ చైర్‌ప ర్సన్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. లాట రీలో కాంగ్రెస్ వార్డు సభ్యులను అదృష్టం వరి ంచి పదవులు దక్కాయి.
భారీగా పోలీసుల మోహరింపు..
తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య వివా దం చోటుచేసుకుంది. దీంతో అప్రమత్తమైన జిల్లా పోలీస్ శాఖ దాదాపు వెయ్యి మందికి పైగా తొర్రూరు తరలించి బందోబస్తు నిర్వహించారు. పట్టణానికి నలుదిశల్లో చెక్ పోస్టులు పెట్టి అనుమానాస్పద వ్యక్తులను అడ్డుకున్నారు. అదే విధంగా మున్సిపల్ కార్యాలయం వద్దకు వస్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును అరెస్టు చేసి నర్సింహులపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలిసిన వెంటనే బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, మాజీ మంత్రి రెడ్యానాయక్ నర్సింహులపేటకు వెళ్లి దయాకర్‌రావుకు మద్దతు తెలిపారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్రిక్తత మధ్య లాటరీ ప్రక్రియ
జిల్లాలో మొత్తం ఐదు మున్సిపాలిటీలు ఉండగా.. సోమవారం తొర్రూరు, డోర్నకల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ జరగలేదు. తొర్రూరు మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉండగా.. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి తొమ్మిది మంది, కాంగ్రెస్ పార్టీ నుంచి ఏడుగురు గెలిచారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్యలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓట్లు వేశారు. దీంతో ఓట్లు సమానం కావడంతో ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. దీంతో ఎన్నిక వాయిదా పడింది. మంగళవారం ఆర్డీఓ గణేశ్ ఇరు పార్టీల సభ్యులకు ఎన్నిక ప్రక్రియ గురించి వివరించారు. మళ్లీ ఇరు పార్టీల చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల పేర్లు ప్రతిపాదించడం.. బలపర్చడం వంటి ప్రక్రియ తర్వాత చైర్మన్ ఎంపిక కోసం చేతులెత్తే ప్రక్రియను నిర్వహించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థికి తొమ్మిది మంది వార్డు సభ్యులు చేతులు ఎత్తారు. అదే విధంగా కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థికి ఏడుగురు వార్డు సభ్యులతోపాటు, ఎమ్మెల్యే, ఎంపీ కూడా చేతులు ఎత్తడంతో సమాన ఓట్లు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో లాటరీ పద్ధతిన ఎన్నిక నిర్వహిస్తాం.. సహకరించాలని అధికారులు ఇరు పార్టీల సభ్యులను కోరారు. అయితే ఎంపీ కడియం కావ్య ఓటు వేయడంపై బీఆర్‌ఎస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. వరంగల్ మున్సిపాలిటీలో ఓటు వేసేందుకు సిద్ధమైన ఆమె తొర్రూరులో వేసేందుకు అనర్హురాలని ప్రశ్నించారు. ఇందుకు కావాల్సిన ఆధారాలు చూపించాలని పట్టుబట్టారు. అయితే ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత అడిగిన సమాచారం ఇస్తామని ఆర్డీఓతో తెలిపి లాటరీ ప్రక్రియను ప్రారంభించారు. ఇరు పార్టీలు సూచించిన వార్డు సభ్యులపేర్లలో ఒక్కొక్కరి పేరు ఐదు చీటీల మీదరాసి మొత్తం పది చీటీలు ఒక డబ్బాలో వేశారు. చీటీలకు కలియ తిప్పి.. అందరికి చూపిస్తూ ఆర్డీఓ అందులో నుంచి ఒక చీటీనీ తీశారు. అలా లాటరీలో వచ్చిన పేర్లను ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన తూనం శ్రావణ్ కుమార్ చైర్మన్‌గా, సోమ రజిని వైస్ చైర్‌పర్సన్‌గా ఎంపికై నట్లు ఆర్డీఓ ప్రకటించి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.
డోర్నకల్‌లో ఒకే ఒక ప్రతిపాదన
సభ్యులు ఆలస్యంగా వచ్చారని వాయిదా పడిన డోర్నకల్ మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక మంగళవారం నిర్వహించారు. మొత్తం 15 వార్డుల్లో 11మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు, నలుగురు బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారు గెలిచారు. అయితే కాంగ్రెస్ నుంచి ముగ్గురు వార్డు సభ్యులు చైర్మన్ పదవికోసం పోటీ పడినట్లు ప్రచారం జరిగింది. అయితే ఏమైందో కానీ సభ్యులు మాత్రం సమయానికి రాలేదు. దీంతో మంగళవారానికి వాయిదా పడింది. అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక ప్రక్రియలో ముందుగా సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్‌పర్సన్ కోసం ప్రతిపాదనలు తెలపాలని కోరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి కొండేటి రాజకుమారిని, వైస్ చైర్‌పర్సన్‌గా మాదా లావణ్య పేర్లు ప్రతిపాదించారు. బీఆర్‌ఎస్ నుంచి ఎవరిని ప్రతిపాదించక పోవడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకుమారిని చైర్‌పర్సన్‌గా, లావణ్యను వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నట్లు ప్రకటించారు.
తొర్రూరు మున్సిపల్ చైర్మన్
ఎన్నికలో ఉద్రిక్త వాతావరణం
ముందస్తు జాగ్రత్తగా పట్టణాన్ని దిగ్బంధించిన పోలీసులు
లాటరీ ద్వారా చైర్మన్,
వైస్ చైర్‌పర్సన్ ఎంపిక
ఎంపీ కావ్య ఓటు చెల్లదని
బీఆర్‌ఎస్ నాయకుల ఆందోళన
డోర్నకల్ మున్సిపల్ చైర్‌పర్సన్
ఏకగ్రీవ ఎన్నిక
ఉద్రిక్తత.. ఉత్కంఠ
ఉద్రిక్తత.. ఉత్కంఠ
ఉద్రిక్తత.. ఉత్కంఠ
ఉద్రిక్తత.. ఉత్కంఠ


