లబ్ధిదారులకే అనుమతులు ఇవ్వండి | - | Sakshi
Sakshi News home page

లబ్ధిదారులకే అనుమతులు ఇవ్వండి

Feb 20 2026 6:35 AM | Updated on Feb 20 2026 6:35 AM

లబ్ధిదారులకే అనుమతులు ఇవ్వండి

లబ్ధిదారులకే అనుమతులు ఇవ్వండి

నర్సింహులపేట: ప్రభుత్వ పనులు, ఇందిరమ్మ ఇళ్లకు మాత్రమే ఇసుక అనుమతులు ఇవ్వాలని, దూర ప్రాంతాలకు ఇవ్వకూడదని ప్రభుత్వ విప్‌ జాటోత్‌ రాంచంద్రునాయక్‌ అన్నారు. గురువారం మండలంలోని లోక్యాతండా శివారు మూడావత్‌తండాలో రేషన్‌ పాయింట్‌ను ప్రారంభించారు. నర్సింహులపేటలో అనారోగ్యంతో బాధపడుతున్న గౌని యాదగిరిని పరామర్శించారు. అనంతరం కౌసల్యదేవిపల్లి ఆకేరు వాగు నుంచి ఇసుకతో వెళ్తున్న ట్రాక్టర్లను నిలిపి కూపన్లు పరిశీలించారు. గ్రామాల్లో జీపీఓ, ఏఈలను తెలుసుకొని ఇసుక అనుమతులు ఇవ్వాలన్నారు. ఇష్టానుసారంగా ఇవ్వకూడదని తహసీల్దార్‌ను హెచ్చరించారు. అక్రమంగా ఇసుక తరలకుండా చెక్‌ పాయింట్‌ పెట్టాలని ఆదేశించారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు తక్కువ ధరకు ఇసుక పోయాలన్నారు. అనంతరం ఎస్సై మాలోతు సురేష్‌ ఇసుక ట్రాక్టర్లను పోలీస్‌ స్టేషన్‌కు తరలించి కూపన్లు పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement