విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

Feb 24 2026 7:34 AM | Updated on Feb 24 2026 7:34 AM

విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

హన్మకొండ: విద్యుత్‌ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలు రెండు నెలల్లో పరిష్కరించాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య టీజీ ఎన్పీడీసీఎల్‌ యాజమాన్యాన్ని ఆదేశించారు. సోమవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ముందు హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్‌ సి.ప్రభాకర్‌ ఎన్పీడీసీఎల్‌లో ఉద్యోగుల నియామకం, రిజర్వేషన్‌ రోస్టర్‌ అమలు తీరు పోస్టుల వారీగా వివరించారు. 2025లో సెప్టెంబర్‌లో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, కార్యాచరణ వివరించారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ విద్యుత్‌ ఉద్యోగుల సంక్షేమ సంఘాల నాయకులు, ఉద్యోగులు తమ సమస్యలు, ఇబ్బందులు కమిషన్‌కు వివరించారు. రాష్ట విభజన నేపథ్యంలో టీజీ ఎన్పీడీసీఎల్‌కు కేటాయించిన ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు సుప్రీం కోర్టు తీర్పు మేరకు తిరిగి ఏపీకి వెళ్లారని, అయితే వారు ఇక్కడ పని చేసిన కాలంలో పదోన్నతి కల్పించడంతో స్థానికులకు నష్టం, అన్యాయం జరిగిందన్నారు. ఏపీ వారు ఇక్కడి వచ్చి సీనియర్లు కావడంతో అప్పటి వరకు ఉన్నత పదవుల్లో ఉన్న వారిని రివర్షన్‌ చేసి పదోన్నతి కల్పించారని, వారు తిరిగి వెళ్లిపోయిన క్రమంలో ఖాళీ అయిన పోస్టుల్లో తిరిగి స్థానిక ఎస్సీ అధికారులకు పదోన్నతి కల్పించకపోవడంతో అ న్యాయం జరిగిందన్నారు. యాజమాన్యానికి ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని, ఇప్పటికై నా న్యాయం చేయాలని కోరారు. స్పందించిన సీఎండీ కర్నాటి వరుణ్‌ రెడ్డి ఈ ప్రక్రియపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తామని చెప్పారు. అదే విధంగా ఇతర సమస్యలు వివరించిన ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు నిర్ణీత కాలంలో సమస్యలు పరిష్కరించాలని కోరగా, ఎప్పటి లోగా పరిష్కరిస్తారో చెప్పాలని కమిషన్‌ ఆదేశించగా రెండు నెలల సమయం కావాలని చెప్పారు. దీంతో అన్ని సమస్యలు రెండు నెలల్లో పరిష్కరించాలని చైర్మన్‌ సూచించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యుడు కొంకటి లక్ష్మీనారాయణ, వి.మోహన్‌ రావు, టి.మధుసూదన్‌, సి.ప్రభాకర్‌, సి.ఈలు టి.తిరుమల్‌ రావు, టి.సదర్‌ లాల్‌, మాధవ రావు, రాజు చౌహాన్‌, అశోక్‌, అన్నపూర్ణ, ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్‌ నాయకులు ఎ.ఆనందం, కుమారస్వామి, బక్క దానయ్య, ఉపేందర్‌, దయానంద్‌, మాతంగి శ్రీనివాస్‌, సుదర్శన్‌, అజ్మీరా శ్రీరాం నాయక్‌, జాటోత్‌ హర్జీ పాల్గొన్నారు.

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌

బక్కి వెంకటయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement