ప్రభుత్వ వైద్యం దూరం
కొత్తగూడ ప్రాంతంలో ఎక్కువ ఏజెన్సీ గూడేలు ఉంటాయి. గర్భిణులకు పురుడు పోసేందుకు పీహెచ్‌సీని 24 గంటల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేశారు. ఇద్దరు డాక్టర్లను నియమించారు. కానీ ఇప్పుడు ఒక్క డాక్టరే వస్తున్నారు. సాయంత్రం తర్వాత వెళ్తారు. రాత్రి పురుడు పోయాలంటే నర్సులే దిక్కు.. ఇద్దరు డాక్టర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలి. – ఆగబోయిన రవి, కొత్తగూడ
పేరుకే 24 గంటల వైద్య సేవలు
ప్రభుత్వ ఆస్పత్రిలో ఉదయం వేళ మాత్రమే వైద్యులు ఉంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రాత్రి సమయంలో ప్రభుత్వ ఆస్పత్రికి వైద్య సేవల కోసం వస్తే వైద్యులు అందుబాటులో ఉండడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తోంది. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రికి వస్తే వైద్యులు, సిబ్బంది ఉండడం లేదు. – తాళ్ల వెంకటేశ్వర్లు, కంటాయపాలెం, తొర్రూరు
రాత్రి పూట మానుకోటకు పోవాలి
గతంలో కంబాలపల్లి పీహెచ్‌సీలో జిల్లాలోనే మెరుగైన వైద్యసేవలు అందించేవారు. కానీ, ప్రస్తుతం వైద్యం అందని పరిస్థితి నెలకొంది. రాత్రింబవళ్లు పనిచేసే ఆస్పత్రిగా స్థాయి పెంచాం అంటున్నారు.. కానీ, సాయంత్రం ఐదు గంటలు దాటితే ఎవరూ ఉండడం లేదు. చిన్న సమస్య వచ్చినా మహబూబాబాద్ వెళ్లాల్సి వస్తోంది. – గంధసిరి సురేశ్, కంబాలపల్లి
●
ప్రభుత్వ వైద్యం దూరం
ప్రభుత్వ వైద్యం దూరం


