సౌకర్యాలు నిల్
బోనాల సందడి
గార్ల రైల్వేస్టేషన్‌లో తాగునీరు కరువు
ఆలయానికి బోనాలతో వెళ్తున్న భక్తులు
కురవి: మండల కేంద్రంలోని భద్రకాళి అమ్మవారికి భక్తులు ఆదివారం బోనాలు సమర్పించారు. ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని ప్రదక్షిణలు చేశారు. అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. కాగా, ఆలయంలో సందడి నెలకొంది.
రైల్వేస్టేషన్‌లో తాగునీటి సౌకర్యం లేదు. మ రుగుదొడ్లకు లైటింగ్ సౌకర్యం లేకపోవడంతో రాత్రివేళల్లో ప్రయాణికులు ఇబ్బందులు ప డుతున్నారు. మరుగుదొడ్లలో నీటి సౌకర్యం లేకపోవడంలో మహిళలు నానా అవస్థలు పడుతున్నారు. లైటింగ్, నీటిసౌకర్యం కల్పించి వినియోగంలోకి తేవాలి.
– ఏదునూరి కుమారస్వామి, గార్ల
రైల్వేస్టేషన్‌లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు, మరుగుదొడ్లకు నీటి సౌకర్యం, వర్షాకాలంలో ప్లాట్‌ఫాంలపై వేసిన రేకుల షెడ్లు కురుస్తుండడంతో ప్రయాణికులు పడరాని పాట్లు పడుతున్నారు. సంబంధిత రైల్వే ఉన్నతాధికారులు స్పందించి స్టేషన్‌లో ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించాలి.
– కందునూరి శ్రీనివాసరావు, గార్ల
ఆంగ్లేయుల కాలంలో నిర్మించిన రైల్వేస్టేషన్ భవనం శిథిలమై వర్షాకాలంలో కురుస్తుంది. మంచి ఆదాయం వస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. ఆదాయం లేని గుండ్రాతిమడుగు, ఇంటికన్నె, చింతలపల్లి, తాళ్లపూసలపల్లి రైల్వేస్టేషన్లకు పక్కా భవనాలు నిర్మించారు. కానీ, ఏజెన్సీ మండలమైన గార్ల రైల్వేస్టేషన్‌కు నేటికీ పక్కా భవనం నిర్మించడం లేదు.
– సూత్రపు రాజుయాదవ్, గార్ల
గార్ల: జిల్లాలోని గార్ల రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో రైల్వే అధి కారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆంగ్లేయుల కాలంలో నిర్మించిన రైల్వేస్టేషన్ భవనం శిథిలమై కురుస్తున్నా.. నేటికీ కొత్త భవనం నిర్మించలేదు. దీంతో ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు. సౌకర్యాలు కల్పించాలని వారు కోరుతున్నారు.
రూ.కోటికిపైగా ఆదాయం..
గార్ల రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల రైలు టికెట్ల ద్వారా రూ.కోటిపైగా ఆదాయం వస్తోంది. అయితే స్టేషన్ ఉన్నతీకరణపై రైల్వే ఉన్నతాధికారులు మా త్రం పట్టించుకోవడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చింతలపల్లి, ఎల్గూరు, ఇంటికన్నె గుండ్రాతిమడుగు రైల్వేస్టేషన్లకు ఆదాయం లేకున్నా రైల్వే ఉన్నతాధికారులు ఆయా స్టేషన్లకు పక్కా భవనాలు, కనీస సౌకర్యాలు కల్పించారని మండల ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాగునీరు, మరుగుదొడ్లలో
నీటి వసతి కరువు..
గార్ల రైల్వేస్టేషన్ అభివృద్ధిపై రైల్వే ఉన్నతాధికారులు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఈ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. రైల్వేస్టేషన్‌లో తాగునీరు, మరుగుదొడ్లలో నీటి వసతి, లైటింగ్ సౌకర్యాలు లేకపోవడంతో ముఖ్యంగా మహిళా ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రైల్వేస్టేషన్ ఎదుటిభాగం నేమ్‌బోర్డు వద్ద రేకులు లేచిపోయి గోడకూలి చూడడానికి అందవికారంగా కనిపిస్తున్నా.. అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రయాణికులకు ప్లాట్‌ఫాంలపై నీడ కోసం సరిపడా రేకుల షెడ్లు ఏర్పాటు చేయలేదు. ఉన్న రేకుల షెడ్లు వర్షం వస్తే కురుస్తున్నాయి. రెండో ప్లాట్‌ఫాంపై టైల్స్ పగిలి ఎత్తుపల్లాలు ఉండడంతో రాత్రి సమయంలో రైలు దిగే ప్రయాణికులు కిందపడిపోతున్నారు. రైల్వే అధికారులు సత్వరమే ప్లాట్‌ఫాం మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉంది. బ్రిటిష్ కాలంలో నిర్మించిన రైల్వేస్టేషన్ భవనం వర్షం వస్తే కురుస్తోంది. ఇప్పటికై నా రైల్వే ఉన్నతాధికారులు స్పందించి రైల్వేస్టేషన్‌కు కొత్త భవనం నిర్మించి, కనీస సౌకర్యాలు కల్పించాలని మండల ప్రజలు, ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
మరుగుదొడ్లకు నిలిచిన నీటి సరఫరా
రెండో ప్లాట్‌ఫాంపై పగిలిన టైల్స్
ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
పట్టించుకోని రైల్వే అధికారులు
సౌకర్యాలు నిల్
సౌకర్యాలు నిల్
సౌకర్యాలు నిల్
సౌకర్యాలు నిల్
సౌకర్యాలు నిల్


