సమగ్రాభివృద్ధే ధ్యేయంగా..
జిల్లాకు చేరుకున్న కేంద్ర బృందం..
దక్షిణ భారతదేశం నుంచి ‘జనగామ’కు అవకాశం
జాతీయ స్థాయిలో ఐదు జిల్లాలను ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం
పట్టణ,
పల్లెల
జనగామ : దేశంలో పట్టణ, పల్లెల మధ్య అంతరం తగ్గించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మొదటి దశలో జాతీయ స్థాయిలో ఐదు జిల్లాలను ఎంపిక చేసింది. ఇందులో దక్షిణ భారత దేశం నుంచి జనగామ ఎంపికై ంది. జనగామ జిల్లా సమగ్రాభివృద్ధికి మార్గ సూచిగా నిలిచే డిస్ట్రిక్ట్ డయాగ్నస్టిక్ విజిట్ ప్లాన్ అమలులోకి రానుండగా, గ్రామీణ జీవనోపాధుల స్థిరీకరణ, పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల విస్తరణ, పథకాల సమన్వయం వంటి కీలక అంశాలపై అధికారులు సుదీర్ఘ అధ్యయనం చేపట్టనున్నారు. నాలుగు నుంచి ఐదు రోజుల పాటు జరిగే ఈ ప్రత్యేక పర్యటనలో జిల్లా సామాజిక, ఆర్థిక నిర్మాణం, అవకాశాలు, అడ్డంకులు, భవిష్యత్ వృద్ధి మార్గాలపై క్షుణ్ణంగా సమీక్ష చేయడం ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమం ద్వారా ‘గ్రామీణ శ్రేయస్సు–స్థితి స్థాపకత’ కార్యక్రమాన్ని జిల్లాకు అనుగుణంగా మలిచే అవకాశాలు పరిశీలించనున్నారు.
ఈ ఎంపిక ముఖ్య ఉద్దేశం..
పట్టణ, గ్రామీణ స్థాయిలో ఆర్థిక శక్తిని పెంచడం, ఉపాధి అవకాశాలను మెరుగుపరుచడం, పెట్టుబడులకు అనువైన వాతావరణం ఏర్పరచడం, జిల్లాకు ప్రత్యేకంగా ఉన్న రంగాలను గుర్తించి వాటిపై ఫోకస్ చేయడం ప్రధాన లక్ష్యం. ప్రైవేట్ రంగం, బ్యాంకులు, రైతు సమూహాలు నుంచి ప్రభుత్వ శాఖల వరకు ప్రతీ వర్గంతో నేరుగా చర్చించి, వారి అవసరాలు, సమస్యలు, ఆలోచనలను సేకరించడం ద్వారా జిల్లాకు అనుకూలమైన అభివృద్ధి రోడ్‌మ్యాప్ రూపొందించడం ఈ విజిట్ ప్రధాన సంకల్పం.
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, వ్యవసాయ ఆధునికీకరణ ద్వారా వలసలు తగ్గించి, ఆర్థిక స్థిరత్వాన్ని పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన గ్రామీణ శ్రేయస్సు–స్థితిస్థాపకత కార్యక్రమంలో భాగంగా ఏషి యన్ డెవలప్‌మెంట్ బ్యాంకు, బోస్టన్ కన్సల్టెన్సీకి చెందిన కేంద్ర ప్రతినిధులు సోమవారం జిల్లాకు చేరుకున్నారు. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా వారికి స్వాగతం ప లికారు. అనంతరం కలెక్టరేట్‌లో వ్యవసాయ, మార్కెటింగ్, హ్యాండ్ల్యూమ్, పరిశ్రమలు తదితర శాఖల అధి కారులతో కేంద్ర బృందం సమీక్ష నిర్వహించింది. అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, కేంద్ర ప్రతినిధులు సునయ్‌కీమ్, అపర్ణ, హర్షద్, ఆనంద్, అంకిత్ పాల్గొన్నారు.
జిల్లా సమగ్రాభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలపై అధ్యయనం
ఏషియన్ ప్రతినిధుల ఆధ్వర్యంలో ఐదు రోజుల పర్యటన
జిల్లాకు చేరుకున్న కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు


