జనంబాట!
న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 25 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
అడవి వదిలి
సాక్షి ప్రతినిధి, వరంగల్ : సీపీఐ(మావోయిస్టు) పార్టీ అగ్రనేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఉద్యమ ప్రస్థానం ముగిసింది. రాడికల్ విద్యార్థి సంఘం (ఆర్‌ఎస్‌యూ) నుంచి విప్లవోద్యమం వైపు అడుగులేసి మూడు దశాబ్దాల పాటు పనిచేసిన మావోయిస్టు కీలక నేత దామోదర్ మంగళవారం జనజీవన స్రవంతిలో కలిశారు. దళసభ్యుడినుంచి తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి వరకు ఎదిగిన ఆయన.. ఆపరేషన్ కగార్, పెరిగిన నిర్బంధాల కారణంగా లొంగిపోతున్నట్లు గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఎట్టకేలకు పార్టీ అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్‌లతోపాటు దామోదర్ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో మంగళవారం లొంగిపోయారు. సుమారు మూడు దశాబ్దాలపాటు ప్రజల కోసం అజ్ఞాతవాసం గడిపిన ఆయన ఎట్టకేలకు జనజీవన స్రవంతిలో కలవడంతో కుటుంబసభ్యులు, బంధువులు, కాల్వపల్లి గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ సంబురాలు చేసుకున్నారు.
ఆర్‌ఎస్‌యూ నేత నుంచి అడవి వైపు...
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లికి చెందిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్ బయ్యారం గ్రామంలో ప్రాథమిక విద్య అభ్యసించారు. రాయనిగూడెం ఉన్నత పాఠశాలలో పదవ తరగతి, గోవిందరావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. 1996లో 10వ తరగతి చదువుతున్న సమయంలో ఆర్‌ఎస్‌యూ కార్యకలాపాల్లో రాటుదేలిన ఆయన 1998 డిసెంబర్‌లో తన బంధువు అయిన బడే నాగేశ్వరరావు అలియాస్ ప్రభాకర్ ప్రేరణతో సీపీఐ(ఎంఎల్) పీపుల్స్‌వార్‌లో చేరి అజ్ఞాతంలోకి వెళ్లారు.
దళసభ్యుడి నుంచి రాష్ట్ర కార్యదర్శి వరకు...
ఏటూరునాగారం–మహదేవపూర్ ప్రాంత దళంలో పార్టీ సభ్యుడిగా చేరి 1999లో కొత్తగూడెం–పాల్వంచ ఏరియా కమిటీకి బదిలీ అయ్యి అక్కడ దళ కమాండర్ దిలీప్ నాయకత్వంలో పనిచేశారు.
● ఆ తర్వాత 2000లో ఏటూరునాగారం దళంలో డిప్యూటీ కమాండర్‌గా, 2001లో కొత్తగూడెం–పాల్వంచ ఏరియా కమిటీ కమాండర్‌గా, 2003లో మేడారం ఎల్‌ఓఎస్ ఇన్‌చార్జ్‌గా, 2005లో ఏరియా కమిటీ కార్యదర్శిగా పదోన్నతి పొంది ఏటూరునాగారం – మహదేవపూర్ ప్రాంతానికి నియమితులయ్యారు.
● 2006లో ఖమ్మం – కరీంనగర్ – వరంగల్ (కేకేడబ్ల్యూ) డివిజనల్ కమిటీ సభ్యుడు పొంది, 2007లో డివిజనల్ కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు.
● 2009లో డివిజనల్ కమిటీ కార్యదర్శి పనిచేసి, 2015లో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు (ఎస్‌సీఎం)గా పదోన్నతి పొంది, అదే సమయంలో కేకేడబ్ల్యూ డివిజనల్ కమిటీ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు చేపట్టారు.
● మార్చి 2019లో తెలంగాణ రాష్ట్ర కమిటీ సైనిక వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా నియమితులైన దామోదర్, యాప నారాయణ అలియాస్ హరిభూషన్ మరణం తర్వాత ఆయన స్థానంలో జనవరి 2025లో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పదోన్నతి పొందారు.
● అప్పటి నుంచి జనజీవన స్రవంతిలో కలిసే వరకు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.
పేరు: బడే చొక్కారావు అలియాస్ దామోదర్
వయస్సు: 47 సంవత్సరాలు
స్వస్థలం: కాల్వపల్లి గ్రామం,
తాడ్వాయి మండలం, ములుగు జిల్లా
మావోయిస్టు పార్టీలో హోదా: తెలంగాణ రాష్ట్ర కమిటీ (టీఎస్‌సీ) కార్యదర్శి
తండ్రి పేరు: బడే ఎల్లయ్య (రైతు)
తల్లి పేరు: బడే బతుకమ్మ (లక్ష్మమ్మ)
ఇతర కుటుంబసభ్యులు: ఇద్దరు సోదరులు, నలుగురు అక్కాచెల్లెళ్లు (వీరిలో ఒక సోదరుడు, ఇద్దరు అక్కాచెల్లెళ్లు చనిపోయారు)
వివాహ జీవితం: జనవరి 2001లో ఏటూరునాగారం మండలం, గోగుపల్లి గ్రామానికి చెందిన ఎర్ర నర్సమ్మ అలియాస్ సబితతో వివాహం, 2012లో ఎన్‌కౌంటర్‌లో సబిత మృతి, అక్టోబర్ 2016లో చర్ల ఎల్‌ఓఎస్ సభ్యురాలు మడకం కోసి అలియాస్ రజితతో వివాహం కాగా 2022లో ఆమె అరెస్టయి ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ జైలులో ఉన్నారు.
దళ సభ్యుడినుంచి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వరకు..
మూడు దశాబ్దాలపాటు ఉద్యమంలో పనిచేసిన మావోయిస్టు అగ్రనేత
డీజీపీ సమక్షంలో లొంగుబాటు
ఆయన రాకతో కుటుంబ సభ్యులు,
బంధువుల సంబురాలు
జనజీవన స్రవంతిలోకి బడే చొక్కారావు అలియాస్ దామోదర్
జనంబాట!
జనంబాట!
జనంబాట!
జనంబాట!


