గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలు
● అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో
మహబూబాబాద్: గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. కలెక్టరేట్ గ్రంథాలయ సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు వసూలు చేసిన గ్రంథాలయ పన్ను ఎప్పటికప్పడు చెల్లించి గ్రంథాలయాల అభివృద్ధికి సహకరించాలన్నారు. నిరుద్యోగులందరూ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శ్రీలత, డీపీఆర్వో రాజేంద్రప్రసాద్, అసిస్టెంట్ ఆడిటర్ ఆఫీసర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


