ఓటెయ్యకుండా అడ్డుకున్నారు.. | - | Sakshi
Sakshi News home page

ఓటెయ్యకుండా అడ్డుకున్నారు..

Feb 18 2026 8:08 AM | Updated on Feb 18 2026 8:08 AM

ఓటెయ్యకుండా అడ్డుకున్నారు..

ఓటెయ్యకుండా అడ్డుకున్నారు..

జనగామ: జనగామ మున్సిపాలిటీ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నికకు సంబంధించి ఓటువేయకుండా అడ్డుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, దళిత కౌన్సిలర్లు ఉడుగుల కిష్టయ్య, మంజుల అన్నారు. మంగళవారం చైర్మన్‌, వైఎస్‌ చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ ముగిసిన అనంతరం ఎమ్మెల్యేతో సహా బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు మున్సిపల్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చైర్మన్‌, వైఎస్‌ చైర్మన్‌ ఎన్నికక సంబంధించి చేతులెత్తే సమయంలో బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చిన 8వ వార్డు దళిత కౌన్సిలర్‌ మంజుల చెయ్యిని లాగి, దాడి చేసిన కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ చెంచారపు కరుణాకర్‌రెడ్డి, ఆ పార్టీకి మద్దతు ఇచ్చిన 15వ వార్డు సభ్యుడు మారబోయిన పాండుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. దళిత కౌన్సిలర్‌ చెయ్యి ఎత్తే క్రమంలో పాండు చేతిని కిందకు కొడుతూ, కరుణాకర్‌రెడ్డి దాడి చేస్తూ.. ‘మాదిగవు, నీకు ఓటు అవసరమా’.. అంటూ దుర్భాషలాడడం క్షమించరాని నేరమన్నారు. ఎన్నికల అధికారి సమక్షంలో జరిగిన ఈ ఘోరాన్ని సీరియస్‌గా తీసుకోవాలన్నారు. బీఆర్‌ఎస్‌కు చేయెత్తే క్రమంలో కరుణాకర్‌రెడ్డి, పాండు తన చెయ్యిని బలవంతంగా కిందకు దింపి దాడి చేశారని మంజుల ఆవేదన వ్యక్తం చేశారు. రౌడీల్లా వ్యవహరించిన పాండు, కరుణాకర్‌రెడ్డిపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇద్దరి సభ్యత్వాలు రద్దు చేసి, చైర్మన్‌ ఎన్నికను వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్యే డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో జనగామ దళిత జాతి ఆందోళనకు దిగుతుందని, ఇద్దరి ఇళ్లను ముట్టడిస్తుందన్నారు. అలాగే, జనగామ బంద్‌కు పిలుపునిస్తామని హెచ్చరించారు. దళిత కౌన్సిలర్‌పై ఓటింగ్‌ హాల్‌లో ఇద్దరు రౌడీల్లా వ్యహరిస్తే పోలీసులు చోద్యం చూశారన్నారు. ఈ ఘటనపై ఆర్డీఓతోపాటు డీసీపీ రాజమహేంద్రనాయక్‌, సీఐకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

ఆ ఇద్దరిపై అట్రాసిటికేసు నమోదు చేయాలి

24 గంటల్లో వారిపై చర్యలు తీసుకోకుంటే ఇళ్లను ముట్టడిస్తాం

జనగామ బంద్‌కు పిలుపునిస్తాం

ఎమ్మెల్యే పల్లా, దళిత కౌన్సిలర్లు ఉడుగుల కిష్టయ్య, మంజుల

ఇద్దరు కౌన్సిలర్లపై ఎస్సీ, ఎస్టీ బెదిరింపు కేసు

జనగామ: జనగామ మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ లాటరీ ఎంపిక సమయంలో 8వ వార్డు కౌ న్సిలర్‌ సందుపట్ల మంజుల చెయ్యి ఎత్తే క్ర మంలో అడ్డుకున్న కాంగ్రెస్‌ 27వ వార్డు కౌన్సిలర్‌ చెంచారపు కరుణాకర్‌రెడ్డి, 15వ వార్డు స్వతంత్ర అభ్యర్థి మారబోయిన పాండుపై కేసు నమోదు చేసినట్లు సీఐ సత్యనారాయణరెడ్డి మంగళవారం తెలిపారు. మహిళా సభ్యురాలు మంజుల ఫిర్యాదుపై ఎన్నికల అధికారి, ఆర్డీఓ గోపీరామ్‌ ఆదేశాల మేరకు ఇద్దరు కౌన్సిలర్లపై ఎస్సీ ఎస్టీ, చే యి లాగడం, బెదిరింపులకు పాల్పడిన ఘట నలపై కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement