వైభవోపేతంగా రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవోపేతంగా రథోత్సవం

Feb 21 2026 7:38 AM | Updated on Feb 21 2026 7:38 AM

వైభవో

వైభవోపేతంగా రథోత్సవం

రథంపై ఊరేగిన వీరభద్రుడు

తరలివచ్చిన భక్తజనం

కురవి: మండల కేంద్రంలో భద్రకాళీ సమేత వీరభద్రుడు శుక్రవారం రాత్రి రథంపై ఊరేగారు. రంగురంగు పూలతో అలంకరించిన రథంపై కల్యాణ వీరభద్రుడు.. భద్రకాళీ అమ్మవారి సమేతంగా పూజలు అందుకుని నెలవంక సాక్షిగా రాత్రి 8.30 గంటలకు రథంపై గ్రామ సేవకు కదలివెళ్లారు. ఆలయ అర్చక స్వాములు, వేద పండితులు అభిలాష్‌, విజయ్‌, తేజ వేద మంత్రోచ్ఛరణలను పఠిస్తూ 7గంటలకు శాస్త్రోక్తంగా పూజలు ప్రారంభించారు. ఆలయ పూజారులు విజయ్‌, విజయ్‌కుమార్‌, తేజ, అభిలాష్‌, పుణ్యమూర్తి ఛండీశ్వరుడిని తీసుకొచ్చి అగ్నిహోమం, వాస్తు పూజలు చేశారు. చొప్పను మంటలో వెలిగించి రథం చుట్టూ తిప్పి ఊరు చివరన వదిలేశారు. పూజారి అనిల్‌కుమార్‌ శావపై నిలబడి రథం వద్దకు మంగళవాయిద్యాలు, సన్నాయి మేళాల నడుమ స్వామివారిని తీసుకొచ్చి ప్రదక్షిణలు చేసిన అనంతరం రథంపై అధిష్టింపజేశారు. విజయ్‌కుమార్‌ దిష్టికుంభం పూజ చేశారు. ఈఓ సత్యనారాయణ, చైర్మన్‌ రవీందర్‌రెడ్డి అర్చకుడు విజయ్‌కుమార్‌ గుమ్మడికాయలు కొట్టారు. భక్తుల జయజయధ్వానాల నడుమ స్వామివారి రఽథాన్ని ఈఓ సత్యనారాయణ, చైర్మన్‌ కొర్ను రవీందర్‌రెడ్డి, మరిపెడ మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ కాలం సునీతారవీందర్‌రెడ్డి, ధర్మకర్తలు బాలగాని శ్రీనివాస్‌, చిన్నం గణేష్‌, ఉప్పలయ్య, శక్రునాయక్‌, సర్పంచ్‌ బాదావత్‌ లక్ష్మీరాజునాయక్‌, ఉప సర్పంచ్‌ ఎర్ర నాగేశ్వర్‌రావు, సీఐ సర్వయ్య, ఎస్సై సతీష్‌, ఏఎస్సై వెంకన్న, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు రాజేందర్‌కుమార్‌, నాయకులు అవిరె మోహన్‌రావు, దైదభద్రయ్య, బాదె శ్రీనివాస్‌, బుడమ సురేష్‌, తాళ్లూరి లక్ష్మీనారాయణ, శ్యామల శ్రీనివాస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు సంగెం భరత్‌, దుడ్డెల వినోద్‌, దడిగల రవి లాగారు. హైదరాబాద్‌కు చెందిన భక్తులు రథానికి పూలతో అలంకరణ చేశారు. రథాన్ని గ్రామ పంచాయతీ వరకు తీసుకొచ్చారు. గ్రామస్తుల పూజల అనంతరం రథాన్ని తిరిగి ఆలయం వరకు తీసుకొచ్చారు.

వైభవోపేతంగా రథోత్సవం 1
1/2

వైభవోపేతంగా రథోత్సవం

వైభవోపేతంగా రథోత్సవం 2
2/2

వైభవోపేతంగా రథోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement