రద్దీ.. కాలుష్యం
రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల సంఖ్య
ఖిలా వరంగల్: వరంగల్ మహా నగర ప్రజలు వ్యక్తిగత వాహనాలపై ప్రయాణించేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో వాహనాల సంఖ్య పెరిగి వాయుకాలుష్యంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రధానంగా 2020 మార్చి నుంచి 2026 జనవరి 31 వరకు వాహనాల సంఖ్య తీవ్రంగా పెరిగినట్లు సమాచారం. కారు, బైక్ నిత్యావసర వస్తువులుగా మారడమే ఇందుకు కారణమని పర్యావరణ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. వ్యక్తిగత, ఉద్యోగ అవసరాల నిమిత్తం ఇళ్ల నుంచి బయల్దేరేవారిలో ఎక్కువమంది సొంతవాహనాలపైన వస్తున్నారు. దీంతో సాధారణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ట్రైసిటీలోనే 3 లక్షల వాహనాల సంచారం
వరంగల్ ట్రైసిటీలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ తీవ్రంగా ఉంటుంది. ఇతర జిల్లాలతోపాటు నగర పరిధిలోని వాహనాలు మొత్తం 3లక్షలకు పైగా నగర రహదారులపై తిరుగుతున్నాయి. ప్రధానంగా వరంగల్ హెడ్‌ఫోస్టాఫీస్, వెంకట్రామ, ఖిలావరంగల్ పెట్రోల్ బంక్, గవిచర్ల, ఎంజీఎం, పోచమ్మమైదానం, ములుగు రోడ్డు, పోలీస్ హెడ్‌క్వాటర్, కేయూ, అదాలత్ జంక్షన్, కలెక్టరెట్, వడ్డెపెల్లి క్రాస్, కాజీపేట జంక్షన్లలో ట్రాఫిక్ సమస్య తలెత్తడంతోపాటు వాహనాలు నిలిచినప్పుడు ఎక్కువగా వాయు కాలుష్యం జరగుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15ఏళ్లు దాటిన సుమారు 50వేల వాహనాలు రహదారులపై సంచరిస్తున్నట్లు అంచనా.. 15ఏళ్లు దాటిన వాహనాల వల్ల అధికంగా కాలుష్యం జరగుతుంది. కావున వీటిని గుర్తించి సీజ్ చేయాలని ప్రజలు కోరుతున్నారు.
అమలు శూన్యం
కాలుష్య ధ్రువీకరణ పత్రాలు లేకున్నా అనేక వాహనాలు యథేచ్ఛగా రోడ్లపై తిప్పుతున్నాయి. ఫలితంగా ప్రజలు కాలుష్యం పెరుగుతోంది. కొన్ని వాహనాల నుంచి నల్లని దట్టమైన పొగ వస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. అయితే ఉమ్మడిజిల్లాలో పెట్రోల్ వాహనాల కంటే డీజిల్ వాహనాల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. డీజిల్‌తో నడిచే వాహనాలు పెట్రోల్ వాహనాల కంటే ఏడు శాతం అదనంగా కాలుష్యాన్ని విడుదల చేస్తున్నాయి. ప్రధానంగా ద్విచక్రవాహనాలు 36శాతం, ఆటో రిక్షాలు 30శాతం, బస్సులు, లారీలు, టాటాఏస్, ట్రక్కులు తదితర 34 శాతం కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వాయు కాలుష్యంతో
జనాల ఉక్కిరిబిక్కిరి
నిత్యావసర వస్తువులుగా కారు, బైక్
ట్రై సిటీలో పెరిగిన వాహనాల రద్దీ
శ్వాసకోశ వ్యాధులబారిన ప్రజలు
జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు
ఉమ్మడి జిల్లాలో వాహనాల సంఖ్య
జిల్లా వాహనాలు
వరంగల్ 2,60 656
హనుమకొండ 3,12,747
జనగామ 89,575
జే.ఎస్ భూపాలపల్లి 1,26,939,
ములుగు 18,200
మహబూబాబాద్ 1,42,199
రద్దీ.. కాలుష్యం


