జేఈఈ ఫలితాల్లో రెజోనెన్స్‌ విజయభేరి | - | Sakshi
Sakshi News home page

జేఈఈ ఫలితాల్లో రెజోనెన్స్‌ విజయభేరి

Feb 18 2026 8:08 AM | Updated on Feb 18 2026 8:08 AM

జేఈఈ

జేఈఈ ఫలితాల్లో రెజోనెన్స్‌ విజయభేరి

హన్మకొండ: జేఈఈ–2026 మెయిన్స్‌లో రెజోనెన్స్‌ కళాశాల విద్యార్థులు విజయభేరి మోగించారు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ప్రకటించిన జేఈఈ మెయిన్స్‌ సెషన్‌–1 ఫలితాల్లో వరంగల్‌ రెజోనెన్స్‌కు చెందిన 13 మంది విద్యార్థులు 99కి పైగా పర్సంటైల్‌, 69 మంది విద్యార్థులు 96 పర్సంటైల్‌, 161 మంది విద్యార్థులు 90కి పైగా పర్సంటైల్‌ సాధించి ఎప్పటిలాగే సత్తా చాటారని రెజోనెన్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ లెక్కల రాజిరెడ్డి తెలిపారు. మంగళవారం హనుమకొండలోని కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. బి.సాకేత్‌ రెడ్డి 99.93 పర్సంటైల్‌, ఎన్‌.నాగచైతన్య 99.78, పి.కార్తీకేయ 99.76, ఎ.రితిక 99.73, ఎం.సాయి కౌశిక్‌ 99.70, జె.హర్షిత్‌ 99.68, వై.సాత్విక 99.65, ఎం.అషార్‌ ఇక్బాల్‌ 99.36, ఆర్‌.జయంత్‌ 99.34, సి.హెచ్‌.సాయి వర్షిత్‌ 99.21, జి.వర్థిని 99.18, ఎస్‌.అకర్ష్‌ 99.15, ఎం.సాత్విక్‌ రెడ్డి 99.02 పర్సంటైల్‌ సాధించారని వివరించారు. వీరితో పాటు తమ కళాశాల విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష అర్హత పొందడానికి అవసరమైన పర్సంటైల్‌తో పాటు ప్రతిష్టాత్మక ఎన్‌ఐటీలో సీట్లు సాధించడానికి కావాల్సిన ఉత్తీర్ణత సాధించారని వివరించారు. ఈ విజయం వెనుక విద్యార్థుల నిరంతర కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, తమ ఫ్యాకల్టీ అత్యుత్తమ బోధన ఉందన్నారు. కార్యక్రంలో డైరెక్టర్లు లెక్కల మహేందర్‌ రెడ్డి, మాదిరెడ్డి దేవేందర్‌ రెడ్డి, సీఏఓ లెక్కల రమ్య రాజిరెడ్డి, అకడమిక్‌ డీన్‌ బి.ఎన్‌.గోపాల్‌రావు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

నాగచైతన్య

అర్రం రితిక

పెర్న కార్తీకేయ

జేఈఈ ఫలితాల్లో రెజోనెన్స్‌ విజయభేరి1
1/3

జేఈఈ ఫలితాల్లో రెజోనెన్స్‌ విజయభేరి

జేఈఈ ఫలితాల్లో రెజోనెన్స్‌ విజయభేరి2
2/3

జేఈఈ ఫలితాల్లో రెజోనెన్స్‌ విజయభేరి

జేఈఈ ఫలితాల్లో రెజోనెన్స్‌ విజయభేరి3
3/3

జేఈఈ ఫలితాల్లో రెజోనెన్స్‌ విజయభేరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement