వైభవోపేతంగా తెప్పోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవోపేతంగా తెప్పోత్సవం

Feb 19 2026 10:00 AM | Updated on Feb 19 2026 10:00 AM

వైభవో

వైభవోపేతంగా తెప్పోత్సవం

కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి కురవి పెద్ద చెరువులో తెప్పోత్సవం వైభవోపేతంగా జరిగింది. ఉత్సవమూర్తులను ఆలయం నుంచి చెరువు వద్దకు శావలో తీసుకొచ్చారు. వేదపండితులు ప్రత్యేక పూజలు చేశారు. పూజలో ప్రభుత్వ విప్‌ జాటోత్‌ రాంచంద్రునాయక్‌ పాల్గొన్నారు. ప్లాస్టిక్‌ డబ్బాలతో తయారు చేసిన హంసవాహనం (తెప్ప)కు విద్యుత్‌ దీపాలంకరణ చేశారు. ఉత్సవమూర్తులను పడవ(తెప్ప)లో అధిష్టింపజేశారు. ముఖ్య అర్చకుడు పెనుగొండ అనిల్‌కుమార్‌ జలాలకు పూజ చేయగా విప్‌ రాంచంద్రునాయక్‌ హారతి ఇచ్చారు. అనంతరం స్వామిఅమ్మవార్లు హంసవాహనంలో విహరించారు. రాజమండ్రి నుంచి వచ్చిన కళాకారుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. తిరుమలాపురం గ్రామానికి చెందిన మహిళలు కోలాటం ఆడారు. హైదరాబాద్‌ పార్శిగుట్టకు చెందిన వీరభద్రీయ కుల సంఘం ఆధ్వర్యంలో ప్రభలతో ఊరేగింపు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ సత్యనారాయణ, చైర్మన్‌ కొర్ను రవీందర్‌రెడ్డి, ధర్మకర్తలు బాలగాని శ్రీనివాస్‌, చిన్నం గణేష్‌, భిక్షపతి, శక్రునాయక్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు అంబటి వీరభద్రంగౌడ్‌, సొసైటీ చైర్మన్‌ గార్లపాటి వెంకటరెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ ఇస్లావత్‌ సుధాకర్‌, సర్పంచ్‌ బాదావత్‌ లక్ష్మీరాజునాయక్‌, ఉప సర్పంచ్‌ ఎర్రనాగేశ్వర్‌రావు, కాంగ్రెస్‌ నాయకులు కొర్ని అనిల్‌, లక్ష్మీనారాయణ, బెడద వీరన్న, వేదపండితులు తదితరులు పాల్గొన్నారు.

వైభవోపేతంగా తెప్పోత్సవం1
1/1

వైభవోపేతంగా తెప్పోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement