హోలీ పండుగకు ప్రత్యేక రైలు సర్వీసులు | - | Sakshi
Sakshi News home page

హోలీ పండుగకు ప్రత్యేక రైలు సర్వీసులు

Feb 21 2026 7:38 AM | Updated on Feb 21 2026 7:38 AM

హోలీ పండుగకు ప్రత్యేక రైలు సర్వీసులు

హోలీ పండుగకు ప్రత్యేక రైలు సర్వీసులు

కాజీపేట రూరల్‌: హోలీ పండుగ నేపథ్యంలో కాజీపేట జంక్షన్‌ మీదుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రయాణికుల సౌకర్యార్థం చర్లపల్లి–దానాపూర్‌, యశ్వంత్‌పూర్‌–హజరత్‌ నిజాముద్దీన్‌ మధ్య 14 ప్రత్యేక రైలు సర్వీస్‌లను ప్రవేశపెట్టి నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్‌ శుక్రవారం తెలిపారు.

చర్లపల్లి–దానాపూర్‌ మధ్య 12 రైళ్లు

ఈ నెల 23, 27, మార్చి 3, 7వ తేదీల్లో చర్లపల్లి– దానాపూర్‌ (07091)ఎక్స్‌ప్రెస్‌, ఈ నెల 25, మార్చి 1, 5, 9న దానాపూర్‌–చర్లపల్లి (07092) వెళ్లే ఎక్స్‌ప్రెస్‌, ఈ నెల 28న చర్లపల్లి–దానాపూర్‌ (07093) వెళ్లే ఎక్స్‌ప్రెస్‌, మార్చి 3న దానాపూర్‌–చర్లపల్లి(07094) వెళ్లే ఎక్స్‌ప్రెస్‌, మార్చి 1న చర్లపల్లి–దానాపూర్‌ (07095) వెళ్లే ఎక్స్‌ప్రెస్‌, మార్చి 3న దానాపూర్‌–చర్లపల్లి (07096) వెళ్లే ఎక్స్‌ప్రెస్‌లకు కాజీపేట జంక్షన్‌లో హాల్టింగ్‌ సౌకర్యం కల్పించారు. దీంతోపాటు రామగుండం, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, బల్లార్షా, చాందాఫోర్ట్‌, గోండియా, బాల్‌ఘట్‌, నాన్‌పూర్‌, జబల్‌పూర్‌, సంత, మానిఖ్‌పూర్‌, ప్రయాగ్‌రాజ్‌, చౌకి, పండిట్‌ దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ జంక్షన్‌, బాక్సర్‌, అరా స్టేషన్‌లలో హాల్టింగ్‌ కల్పించారు.

యశ్వంత్‌పూర్‌– హజరత్‌నిజాముద్దీన్‌ మధ్య

ఈ నెల 25వ తేదీన యశ్వంత్‌పూర్‌– హజరత్‌నిజాముద్దిన్‌ (06569) వెళ్లే ఎక్స్‌ప్రెస్‌, మార్చి 1న హజరత్‌నిజాముద్దిన్‌– యశ్వంత్‌పూర్‌ (06570) వెళ్లే ఎక్స్‌ప్రెస్‌లకు ఝెలహంక, ధర్మవరం, అనంతపూర్‌, దోన్‌, కర్నూల్‌సిటీ, కాచిగుడ, కాజీపేట, బల్లార్షా, నాగ్‌పూర్‌, బోపాల్‌, బీనా, విరాన్‌గణ, లక్ష్మీబాయి ఝాన్సీ, గ్వాలియర్‌, ఆగ్రా, మాథుర జంక్షన్‌లో హాల్టింగ్‌ సౌకర్యం కల్పించారు. 2ఏసీ, 3ఏసీ, స్లీపర్‌ క్లాస్‌ అండ్‌ జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు ఉంటాయని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement