ఇంటర్‌ పరీక్షలు సజావుగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ పరీక్షలు సజావుగా నిర్వహించాలి

Feb 21 2026 7:38 AM | Updated on Feb 21 2026 7:38 AM

ఇంటర్‌ పరీక్షలు సజావుగా నిర్వహించాలి

ఇంటర్‌ పరీక్షలు సజావుగా నిర్వహించాలి

డీఐఈఓ మదార్‌గౌడ్‌

మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లాలో ఈ నెల 25నుంచి ఇంటర్‌ పరీక్షలను సజావుగా నిర్వహించాలని డీఐఈఓ మదార్‌గౌడ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో శుక్రవారం ఇంటర్‌ పరీక్షలపై చీఫ్‌ సూపరింటెండెంట్‌, డీఎస్‌ఓలు, ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐఈఓ హాజరై మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 18 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, మొదటి సంవత్సరంలో 4,158మంది విద్యార్థులు, రెండో సంవత్సరంలో 4,129 మంది మొత్తం 8,287మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారని చెప్పారు. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద భారీ పోలీసు బందోబస్తుతో పాటు 144సెక్షన్‌ అమలులో ఉంటుందని, సీసీ కెమెరాల నిఘా మధ్య పరీక్షలు జరుగుతయన్నారు. విద్యార్థులు కళాశాల లాగిన్‌లో హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని, పరీక్ష కేంద్రంలోని సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులను తీసుకురావొద్దని, ఒక్క నిమిషం ఆలస్యం నిబంధన అమల్లో ఉంటుందన్నారు. ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాయాలన్నారు. జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు, సీఎస్‌, డీఎస్‌ఓ, డీఓలు పొక్కుల సదానందం, శ్రీనివాస్‌రావు, కుమార్‌, గణేష్‌, నయీమ్‌పాషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement