సీఎం కప్‌ రాష్ట్రస్థాయి పోటీలకు తండ్రీకూతురు | - | Sakshi
Sakshi News home page

సీఎం కప్‌ రాష్ట్రస్థాయి పోటీలకు తండ్రీకూతురు

Feb 19 2026 10:04 AM | Updated on Feb 19 2026 10:04 AM

సీఎం

సీఎం కప్‌ రాష్ట్రస్థాయి పోటీలకు తండ్రీకూతురు

సాఫ్ట్‌బాల్‌ క్రీడలో వేర్వేరు విభాగాల్లో సత్తా!

పాలకుర్తి: తండ్రీకూతురు ఒకే ఆటలో సత్తాచాటారు.. సీఎం కప్‌ చాంపియన్‌షిప్‌లో వేర్వేరు విభాగాల్లో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామానికి చెందిన బాలబోయిన సందీప్‌, ఆయన కూతురు బాలబోయిన స్మైలిక ఈనెల 14న జనగామలో జరిగిన జిల్లాస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. పురుషుల విభాగంలో సందీప్‌, బాలికల విభాగంలో స్మైలిక రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం విశేషం. వీరు ఈనెల 20నుంచి 23 వరకు మెదక్‌ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి సీఎం కప్‌ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో పాల్గొననున్నారు. సందీప్‌ ఒకసారి జాతీయ స్థాయి, ఏడుసార్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. అలాగే స్మైలిక జాతీయ స్థాయిలో రెండుసార్లు, రాష్ట్రస్థాయిలో ఐదుసార్లు పాల్గొని ప్రతిభచాటింది. సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో గ్రామానికి జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో పేరుతెస్తున్న తండ్రీకూతుళ్లకు ఈసందర్భంగా గ్రామస్తులు అభినందనలు తెలిపారు. కాగా, బాలబోయిన సందీప్‌ ఐనవోలు ఎంజేపీలో పీఈటీగా పనిచేస్తుండగా, స్మైలిక ఉర్సుగుట్ట మహాత్మా జ్యోతిబాఫూలే బాలికల గురుకులంలో 9వ తరగతి చదువుతోంది.

సీఎం కప్‌ రాష్ట్రస్థాయి పోటీలకు తండ్రీకూతురు1
1/1

సీఎం కప్‌ రాష్ట్రస్థాయి పోటీలకు తండ్రీకూతురు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement