అరుదైన శతావధాన ప్రక్రియ ఇది
అవధానం అనేది కేవలం ఒక విద్యే మాత్రమే కాదు.. బహువిద్యల సమాహారం. అది ఒక మహావిద్య. ఏకకాలంలో అనేక అంశాలపై మనస్సు పెట్టి ఏకాగ్రతతో ఉండడమే అవధాన విద్య. సాహిత్యంలో అరుదైన శతావధానం ప్రక్రియ ఇది. ఐదేళ్ల క్రితం అవధాన రంగంలోకి ప్రవేశించా. శతావధానం కోసం గత కొంతకాలంగా సాధన చేస్తున్నా. సఫలీకృతుడనవుతానని గట్టి నమ్మకం ఉంది.
– చేపూరి శ్రీరాం, అవధాని,
ఉపాధ్యాయుడు
వేలేరు గురుకుల టీచర్‌కు
అరుదైన అవకాశం
వేలేరు: వేలేరు మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు డాక్టర్ కుమ్మరి ఓదెలుకు అరుదైన అవకాశం లభించింది. కాకతీయ విశ్వవిద్యాలయంలో స్వర్ణోత్సవ సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈనెల 22, 23, 24వ తేదీల్లో జరగనున్న శతావధాన మహోత్సవంలో ఆయన పాల్గొని తెలుగు భాష, సంస్కృతి సంప్రదాయాలు, సాహిత్య ప్రకియల్లో భాగమైన పద్యాలపై ఏకాగ్రత, ధారణ, జ్ఞాపకశక్తి, సాహిత్య పాండిత్యాలకు ప్రతీకగా నిలిచే అవధాన ప్రక్రియల్లో ఒకటైన ఆశువు అనే అంశంపై పృచ్ఛకుడిగా పాల్గొననున్నారు.
అరుదైన శతావధాన ప్రక్రియ ఇది


