సమయపాలన పాటించని అధికారులు | - | Sakshi
Sakshi News home page

సమయపాలన పాటించని అధికారులు

Feb 24 2026 7:31 AM | Updated on Feb 24 2026 7:31 AM

సమయపాలన పాటించని అధికారులు

సమయపాలన పాటించని అధికారులు

గార్ల: గార్ల ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం జరగాల్సిన ఈజీఎస్‌ ఓపెన్‌ ఫోరం సమావేశానికి జిల్లా అధికారులు సమయపాలన పాటించకుండా 4 గంటలు ఆలస్యంగా రావడంతో ప్రజాప్రతినిధులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సమావేశాన్ని నేటికి వాయిదా వేస్తున్నట్లు జిల్లా పీడీ మధుసూదనరాజు ప్రకటించారు. ఉదయం 10 గంటల కు ప్రారంభం కావాల్సిన సమావేశానికి సంబంధిత జిల్లా అధికారులు మధ్యాహ్నం రావడంతో ఉద యం నుంచి వేచిఉన్న సర్పంచ్‌లు, వివిధ పార్టీల నాయకులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశాన్ని వాయిదా వేయాలని సర్పంచ్‌లు కోరడంతో గత్యంతరం లేని పరిస్థితిలో అధికారులు నేటికి వాయిదా వేశారు. నేడు రైతువేదిక భవనంలో ఉదయం 11.30 గంటలకు ఓపెన్‌ఫోరం సమావేశం నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు గంగావత్‌ రాంసింగ్‌, బానోత్‌ మోతీలాల్‌, వివిధ పార్టీల నాయకులు జడ సత్యనారాయణ, కట్టెబోయిన శ్రీనివాస్‌, పెద్దవెంకటేశ్వర్లు, యాకూబ్‌పాషా, గౌని భద్రయ్య, రాగం రమేష్‌, మల్లేష్‌, ఇర్రి రవి, తదితరులు పాల్గొన్నారు.

అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజాప్రతినిధులు, నాయకులు

ఈజీఎస్‌ ఓపెన్‌ ఫోరం నేటికి వాయిదా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement