మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి
మహబూబాబాద్ అర్బన్: విద్యార్థులు మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని ఎకై ్సజ్ సీఐ చిరంజీవి అన్నారు. జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలలో బుధవారం ఎకై ్సజ్ సూపరిండెంటెంట్ ఆదేశాల మేరకు విద్యార్థులకు డ్రగ్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎకై ్సజ్ సీఐ మాట్లాడుతూ.. గుడుంబా, బెల్లం, గంజాయి, డ్రగ్స్ వినియోగించడం వల్ల కుటుంబాలు రోడ్డున పడుతా యన్నారు. చెడు అలవాట్లకు విద్యార్థులు దూ రంగా ఉండాలని, చదువుతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందన్నారు. ఎవరైనా మత్తు ప దార్థాలు విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ డోలి సత్యనా రాయణ, ప్రిన్సిపాల్ కృష్ణప్రసాద్, వైస్ ప్రిన్సి పాల్ శంకర్, అధ్యాపకులు ప్రసాద్, ముత్త య్య, రమేష్, శేఖర్, రవికుమార్ పాల్గొన్నారు.
రసాయన రహిత వ్యవసాయం మేలు
మహబూబాబాద్ రూరల్: రసాయన రహిత, పర్యావరణహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు అన్నారు. జాతీయ సహజ వ్యవసాయ మిషన్‌పై మహిళా రైతులకు మహబూబాబాద్ మండలంలోని సీత్లా తండా గ్రామంలో బుధవారం శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ.. పంటల సాగు సమయంలో బయట నుంచి కొనుగోలు చేసే ఎరువులు, పురుగు మందుల వల్ల అదనంగా పెట్టుబడి ఖర్చు పెరుగుతుందన్నారు. పెట్టుబడి ఖర్చు తగ్గించి, ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు జీవవైవిధ్య ఎరువులు, జీవామృతం, బీజామృతం, మల్చింగ్ పద్ధతుల ద్వారా నేల ఆరోగ్యం మెరుగుపర్చడానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఓ నారెడ్డి తిరుపతిరెడ్డి, ఏఈఓ పున్నమి, సర్పంచ్ హలావత్ కమ్లీ, పంచాయతీ కార్యదర్శి హరి, రైతులు పాల్గొన్నారు.
ప్రతీ విద్యార్థి సామర్థ్యాన్ని వెలికితీయాలి
పెద్దవంగర: ప్రతీ విద్యార్థి సామర్థ్యాన్ని వెలికితీయాలని, క్రమశిక్షణతో చదివితే ఉత్తమ ఫలితాలు సాధ్యమని డీఈఓ రాజేశ్వర్ రావు పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంతో పాటు వడ్డేకొత్తపల్లి, చిట్యాల, బొమ్మకల్లు జెడ్పీ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను ఆయన సందర్శించారు. పాఠశాలలో జరుగుతున్న విద్యా కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమై వార్షిక పరీక్షల దృష్ట్యా పాఠ్యాంశాల పునఃశ్చరణ, సమయపాలన, మెరుగైన ఫలి తాల సాధనకు అనుసరించాల్సిన విధానాలపై వి ద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశాల్లో బోధన ప్రమాణాలు, విద్యార్థుల హాజరు, అభ్యాస ఫలితాలు, పా ఠశాల నిర్వహణ అంశాలపై చర్చించి అవసరమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలను పరిశీలించి పునాది స్థాయి చదువు–లెక్కలు కార్యక్రమం అమలు స్థితిని సమీక్షించారు. విద్యార్థుల అభ్యాసం మెరుగుపడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆయన ఆదేశించారు. జిల్లా సైన్స్ అధి కారి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
భారీగా మిర్చి రాక
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు బుధవారం భారీగా మిర్చి అమ్మకానికి వచ్చింది. 2,903 బస్తాల మిర్చి విక్రయం జరిగినట్లు మార్కెట్ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్, కార్యదర్శి సుజన్ బాబు తెలిపారు. తేజ రకం మిర్చి 2,646 బస్తాలు విక్రయం జరుగగా.. క్వింటాకు గరిష్ట ధర రూ.17,976, కనిష్ట ధర రూ.10,711 పలికిందన్నారు. తాలురకం మిర్చి 257 బస్తాలు కొనుగోలు జరుగగా.. క్వింటాకు గరిష్ట ధర రూ.11,611, కనిష్ట ధర రూ.10,002 పలికిందని తెలిపారు.
మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి


