విద్యార్థుల ఆందోళన
మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియం ఎదుట ఉన్న ఏకలవ్య గురుకుల బాలుర పాఠశాలలో నాణ్యమైన ఆహారం అందించడం లేదని విద్యార్థులు స్కూల్ గేట్ ముందు బైఠాయించి బుధవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి ఉద్య మ నాయకుల సంఘం జిల్లా నాయకుడు మా లోతు శాంతికుమార్ మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలలో పౌష్టికాహారం పెట్టడం లేదని, ఉపాధ్యాయులు, అటెండర్ విద్యార్థులను బూ తులు తిడుతున్నారని ఆరోపించారు. విద్యార్థులకు సరైన మౌలిక వసతులు లేవని, పాఠశాల ప్రిన్సిపాల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్సీఓ రత్నకుమారి సంఘటన స్థలానికి చేరుకొని విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థి ఉద్యమ సంఘం నాయకులు శ్రీకాంత్, సాయిరాం, బన్ని, సంతోష్, రామ్‌కుమార్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


