కుమారుడి కడసారి చూపునకు నోచుకోని తండ్రి
మహబూబాబాద్ రూరల్: రోడ్డు ప్రమాదంలో చిన్న కుమారుడు మృతిచెందగా పెద్ద కుమారుడికి తీవ్రగాయాలు అయ్యాయి. వారిని చూసేందుకు వెళ్తూ తండ్రి తీవ్ర గాయాలపాలయ్యాడు. తండ్రి, పెద్దకొ డుకు వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. మృతుడికి పినతండ్రి(బాబాయ్) తలకొరవి పెట్టా డు. కన్న కుమారుడిని కడసారి చూసుకునేందుకు వీలులేకుండా తండ్రి ఆస్పత్రి పాలైన సంఘటన మ హబూబాబాద్ మండలంలోని మోట్లతండా గ్రామ పరిధిలోని దుబ్బతండాలో బుధవారం జరిగింది. స్థా నికుల కథనం ప్రకారం.. దుబ్బతండాకు చెందిన భూ క్య బాలు–తారమ్మ దంపతులకు యువరాజ్, దేవరాజ్(22) ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిద్దరూ ద్విచక్ర వాహనంపై బయ్యారం మండలంలోని ఉప్పలపాడు తండాలోని అమ్మమ్మ ఇంటికి మంగళవారం రాత్రి వెళ్తుండగా.. తండా సమీపంలోని ప్ర భుత్వ పాఠశాల ఎదురుగా రహదారి పక్క న ఉన్న మట్టిదిబ్బను వారి ద్విచక్రవాహనం ఢీకొనడంతో దేవరాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. యువరాజుకు తీవ్ర గాయాలు కావడంతో మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. విష యం తెలుసుకున్న తండ్రి భూక్య బాలు సమీప బంధువు సురేశ్ ద్విచక్ర వాహనంపై మహబూబాబాద్ వెళ్తున్న క్రమంలో నడివాడ జీపీ పరిధిలోని రంగశాయపేట దగ్గర అదుపు తప్పి కిందపడంతో తీవ్ర గా యాలయ్యాయి. బాలును మానుకోట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించగా.. ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందని వైద్యులు తెలపడంతో హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో దేవరా జ్ అంత్యక్రియలను ఆయన పినతండ్రి (బాబా య్) భూక్య లాలు నిర్వహించారు. కొడుకును చివరిసారిగా తండ్రి చూసుకోలేకపోవడంతో తండావా సులు, కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు.
రోడ్డు ప్రమాదంలో చిన్నకుమారుడి
దుర్మరణం..పెద్దకుమారుడికి తీవ్రగాయాలు
వారిని చూసేందుకు వెళ్తూ
తీవ్రంగా గాయపడిన తండ్రి


