డ్రైవర్లకు కంటి చూపు ముఖ్యం | - | Sakshi
Sakshi News home page

డ్రైవర్లకు కంటి చూపు ముఖ్యం

Feb 24 2026 7:31 AM | Updated on Feb 24 2026 7:31 AM

డ్రైవర్లకు కంటి చూపు ముఖ్యం

డ్రైవర్లకు కంటి చూపు ముఖ్యం

డీఎస్పీ తిరుపతిరావు

మహబూబాబాద్‌ రూరల్‌: లారీలు, ఆటోలు, ఇతర వాహనాలు నడిపే డ్రైవర్లకు కంటి చూపు ముఖ్యమని డీఎస్పీ తిరుపతిరావు అన్నారు. అరైవ్‌.. అలైవ్‌ కార్యక్రమంలో భాగంగా లారీ, ఆటో డ్రైవర్లకు మహబూబాబాద్‌ టౌన్‌ పోలీసులు సోమవారం కంటి పరీక్షలు చేయించారు. ఈ సందర్భంగా డీఎస్పీ తిరుపతిరావు మాట్లాడుతూ వాహన డ్రైవర్లు ఆరోగ్యంతో ఉంటేనే సురక్షిత ప్రయాణం సాధ్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ చేపట్టిన అరైవ్‌.. అలైవ్‌ ద్వారా ప్రతీఒక్కరికి మేలు కలగాలని అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. టౌన్‌ సీఐ గట్ల మహేందర్‌ రెడ్డి, ట్రాఫిక్‌ ఎస్సై చీర్ల అరుణ్‌ కుమార్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

వృత్తి విద్యాకోర్సులతో ఉద్యోగాలు

మహబూబాబాద్‌ అర్బన్‌: వృత్తి విద్యా కోర్సులతో విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగాలు సాధించవచ్చని డీఎస్పీ తిరుపతిరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీచైతన్య ఓకేషనల్‌ కళాశాలలో సోమవారం ద్వితీయ సంవత్సరం విద్యార్థుల వీడ్కోలు సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతీ విద్యార్థికి ఇంటర్మీడియట్‌ దశ కీలకమని అన్నారు. లక్ష్యాన్ని ఎంచుకుని చదివితే భవిష్యత్‌లో ఆనందంగా ఉండొచ్చని వివరించారు. అనంతరం డీఐఈఓ మదార్‌గౌడ్‌ మాట్లాడుతూ.. వృత్తి విద్యాకోర్సులతో విద్యార్థులకు భవిష్యత్‌ ఉంటుందని తెలిపారు. డీఎస్పీని, డీఐఈఓను కళాశాల అధ్యాపక బృందం సన్మానించారు. సమావేశంలో కళాశాల చైర్మన్‌ చల్లగాలి మోసెస్‌, ప్రిన్సిపాల్‌ పుల్లారావు, ఆత్మకమిటీ చైర్మన్‌ నల్లు సుధాకర్‌రెడ్డి, అధ్యాపకులు వసంత, పాపారావు, సుధాకర్‌, శ్రీనివాస్‌రెడ్డి, తిరుమలేష్‌, ప్రసాద్‌, రాజు, కళావతి, రమ్య విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement